ఖుష్బూ వెయిట్ లాస్ సీక్రెట్స్: 32కిలోలు తగ్గిన ఖుష్బూ డైట్, ఫిట్నెస్ మంత్ర ఇదే!
సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సుందర్ ఇటీవల కాలంలో చాలా స్లిమ్ గా, అందంగా కనిపిస్తున్నారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉన్న కుష్బూ బరువు తగ్గడానికి ఇటువంటి వర్కౌట్స్ చేశారు. ఎటువంటి డైట్ తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి అనేది ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది.
ఖుష్బూ ఫిట్ నెస్ సీక్రెట్స్ వైరల్
తన 55 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌నెస్‌కు కొత్త నిర్వచనం ఇస్తున్నారు ఖుష్బూ సుందర్. మూడు సంవత్సరాల్లో 32 కేజీలు తగ్గిన ఆమె, జిమ్‌కు వెళ్లకుండానే తన బరువు తగ్గించుకున్న అనుభవం, డైట్ ప్లాన్‌ను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రేక్షకులతో పంచుకున్నారు. ఆమె ఫాలో అయిన సింపుల్ ఫిట్నెస్ టిప్స్ ఇప్పుడు అభిమానుల మధ్య వైరల్ అవుతున్నాయి.

నో జిమ్.. రోజూ ఖుష్బూ చేసేదిదే
ఖుష్బూ తన ఫిట్నెస్ జర్నీలో జిమ్‌ను ఎప్పుడూ ఆప్రోచ్ చేయలేదు. ఆమె రోజుకు రెండు సార్లు నడకను భాగం చేసుకున్నారు. ప్రతిరోజు ఉదయం 45 నిమిషాలు సాయంత్రం 45 నిమిషాలు క్రమం తప్పకుండా నడుస్తానని తెలిపారు. ఇక డైట్ లో కూడా మార్పులు చేసుకున్నానని, కొన్ని ముఖ్యమైన లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకున్నానని ఖుష్బూ సుందర్ తెలిపారు.
డైట్లో మైదా, స్వీట్స్, పంచదారను తగ్గించిన ఖుష్బూ
ఖుష్బూ డైట్లో మైదా, స్వీట్స్, పంచదారను పూర్తిగా తగ్గించేశారు. చపాతీలు కూడా తనకు సెట్ కావడం లేదని భావించి వాటిని కూడా మానేశారు. ఖుష్బూ ముఖ్యంగా డైట్ లో ఇష్టమైన ఆహారాలను తక్కువ పరిమాణంలో తీసుకోవడం చేస్తానని చెప్పారు. ఆకలి అయినప్పుడు మాత్రమే తినడం, ఒకవేళ భోజనం చేసిన కడుపునిండా తినక పోవడం షూటింగ్లో ఉన్న సరే ఇంటి నుండి తెచ్చుకున్న పౌష్టిక ఆహారాన్ని తినడం చేస్తానని తెలిపారు.
జీవన శైలి మార్పులతో బరువుకు చెక్
జంక్ ఫుడ్, ఫ్రైడ్ ఐటమ్స్, స్పైసి ఫుడ్ లకు దూరంగా ఉంటానని వెల్లడించారు. ఖుష్బూ తన శరీరాన్ని అర్థం చేసుకుని, ఫ్యాడ్ డైట్లు కాకుండా స్థిరమైన జీవనశైలి మార్పులతో బరువు తగ్గడం సాధ్యమైందని చెప్పారు.బరువు తగ్గటం వేగంగా కాదు, క్రమ పద్దతిలో తగ్గాలన్నారు.
ప్రస్తుతం 32 కిలోలు తగ్గిన ఖుష్బూ
మూడేళ్లుగా డైట్ చేస్తున్న క్రమంలో ప్రస్తుతం 32 కిలోలు తగ్గానని ఖుష్బూ తెలిపారు. ప్రస్తుతం 55 ఏళ్ల వయసులోనూ ఎలాంటి బీపీ లేదా షుగర్ సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉన్నానన్నారు. తన అభిమానులందరూ కూడా ఆరోగ్యవంతమైన జీవనశైలిని అనుసరించాలని సూచించారు.













Click it and Unblock the Notifications