నిమ్మరసం తీసుకోండి.. డాక్టర్ అవసరంలేదు!

నిమ్మరసం ఆరోగ్యానికి ఎంతో మేలు. నిమ్మరసం కలిపిన నీటిని ప్రతిరోజు ఉదయం పరగడుపున తీసుకుంటే ప్రయోజనాలు బోలెడు. గోరువెచ్చని నీటిలో తేనె, నిమ్మరసం కలిపి తాగేవారు ఎంతోమంది ఉంటారు. అలా చేయడంవల్ల వ్యాధి నిరోధక శక్తి బలంగా ఉంటుంది. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటనేది తెలుసుకుందాం.

ప్రతిరోజు నిమ్మరసం తీసుకోవడంవల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి, జీవక్రియలు చురుగ్గా పనిచేయడానికి సహాయ పడుతుంది. చర్మం, కణజాలం ఆరోగ్యంగా ఉండేందుకు కొల్లాజెన్ అవసరం. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. కణాలు దెబ్బతినకుండా నిమ్మరసంలో ఉండే విటమిన్ సి చూస్తుంది. దీనివల్ల చర్మం తాజాగా ఉండటంతోపాటు ముడతలు పడటాన్ని కూడా నివారిస్తుంది. జలుబు, దగ్గు, అలర్జీ వంటివాటితో బాధపడేవారికి దివ్యమైన ఔషధం లాంటిది నిమ్మరసం. ప్రతిరోజు ఉదయాన్నే తీసుకోవడంవల్ల యాంటీ ఏజింగ్ ప్రయోజనం దక్కుతుంది.

lemon juice health benefits and uses in telugu

బరువు తగ్గేందుకు తోడ్పడటమే కాకుండా శరీరంలోని చెడు కొవ్వును కూడా నిమ్మరసం కరిగిస్తుంది. నిమ్మలో ఉండే పొటాషియం గుండెకు రక్షణగా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఇందులోని సిట్రిక్ యాసిడ్ సాయపడుతుంది. నిమ్మలో ఉండే అసిడిక్ గుణం పళ్లపై ఉండే ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. అందుకే నిమ్మరసాన్ని ఎప్పుడూ నీటితో కలిపి తీసుకోవాలి. నోటి దుర్వాసన, చిగుళ్ల సమస్యలను నివారిస్తుంది. నిమ్మలో అసిడిక్ స్వభావంతో నీటికి ఆల్కలైజింగ్ అయ్యే స్వభావం కలుగుతుంది. ఇది శరీరంలోని పీహెచ్ బ్యాలన్స్ కు మేలు చేయడంవల్ల ఆరోగ్యం దృఢంగా మారుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+