Air Pollution: వాయుకాలుష్యంపై సంచలన రీసెర్చ్ రిపోర్ట్.. తెలుసుకుని జాగ్రత్తపడండి..
Air Pollution Risks: దీపావళి దగ్గరపడుతోంది. దీనికి తోడు చలికాలం త్వరలో స్టార్ట్ అవనుంది. ఈ సమయంలో దిల్లీ వంటి ప్రధాన నగరాల్లో వాయుకాలుష్య సమస్య పెరిగిపోతోంది. దీని కారణంగా ఉండే అనేక ఆరోగ్య సమస్యల గురించి చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాయు కాలుష్యం కారణంగా గుండె, శ్వాసకోశానికి సంబంధించిన అనేక సమస్యలు వస్తుంటాయని ఇప్పటి వరకు మనకు తెలిసిందే. ఎయిర్ క్వాలిటీ తగ్గటం ప్రజలకు మానసిక అనారోగ్యాలకు దారితీస్తూ గణనీయమైన చెబు ప్రభావాన్ని కలిగిస్తుందని పరిశోధనలు వెల్లడించాయి. స్టడీలో పూర్ ఎయిర్ క్వాలిటీ మనుషుల మానసిక ఆరోగ్యపై ప్రభావం చూపుతూ.. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి అనారోగ్యాలను కలిగిస్తుందని వెల్లడైంది. బయట వాతావరణంలో 2.5 మిల్లీమిటర్ల కంటే చిన్న దుమ్ము రేణువులు లేదా పదార్థాలు మనిషి ఊపిరితిత్తుల్లో, మైక్రోస్కోపిక్ కణాల్లోకి ప్రవేశించగలవని బెంగళూరులోని సక్రా వరల్డ్ హాస్పిటల్‌లోని క్లినికల్ సైకాలజిస్ట్ డాక్టర్ శిల్పి సరస్వత్ వెల్లడించారు.

ఇలా దుమ్మురేణువులు శరీరంలోకి చొరబటం వల్ల కణాల్లో ఆక్సీకరణ ఒత్తిడిని పెంచి మంటను కలిగిస్తాయని సరస్వత్ పేర్కొన్నారు. అలాగే అవి ఘ్రాణ నాడి ద్వారా నేరుగా మెదడులోకి ప్రవేశించడం ద్వారా మెదడు కణజాలాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. కాలుష్యబరితంగా మారిన గాలిని పీల్చటం వల్ల స్వల్పకాలిక, దీర్ఘకాలిక మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. గత ఐదేళ్లలో అధిక కాలుష్య స్థాయిలకు గురైన వ్యక్తుల్లో నిరాశ, ఆత్మహత్య ఆలోచనలు, జీవన నాణ్యతను తగ్గించే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే కాలుష్యం ఆటిజం, ఎడిహెచ్‌డి, దృష్టి జీవక్రియ సంబంధిత వ్యాధులు, అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి న్యూరోడెజెనరేటివ్ వ్యాధులకు కూడా కారణమౌతున్నట్లు వెల్లడించారు.

బయటి నుంచి మనం పీల్చే చాలా కాలుష్య కారకాలు కిటికీలు, తలుపులు, ఇతర ఓపెనింగ్‌ల ద్వారా మన ఇళ్లలోకి ప్రవేశిస్తాయి కాబట్టి మన మానసిక ఆరోగ్యానికి వాయు కాలుష్యం వల్ల కలిగే ప్రమాదాలు ఇంట్లోనే ఉండేవారిపై కూడా ఉంటాయని తెలిపారు. కంపెనీల్లో పనిచేసే వ్యక్తులు 90 శాతం సమయాన్ని ఆఫీసులో గడుపుతారు కాబట్టి స్వచ్ఛమైన గాలిని పీల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తక్కువ క్వాలిటీ గాలిని ఎక్కువ కాలం పాటు పీల్చే వ్యక్తుల్లో చిరాకు, అలసట వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయని స్టడీ వెల్లడించింది. వాయుకాలుష్యం మనిషి మెదడులోని ఆక్సిజన్ స్థాయిలను సైతం తగ్గిస్తుందని ఆమె వెల్లడించారు. రిశ్రామిక ప్రాంతాలకు దగ్గరగా లేదా తక్కువ-ఆదాయ పొరుగు ప్రాంతాల్లో నివసించే వ్యక్తులు కాలుష్య కారకాలకు గురవుతుంటారు. ఇది వారికి మానసిక రుగ్మతల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనల్లో తేలింది.












Click it and Unblock the Notifications