సారీ.. సర్: ప్రధాని మోదీకి క్షమాపణలు చెప్పిన సోషల్ మీడియా దిగ్గజం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే పోస్ట్ చేసిన వీడియోల వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ ఆందోళనలు, సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం గురించి ఆరా తీస్తూ కొద్దిరోజుల కిందటే ఆయన వరుసగా ఈ సెల్ఫీ వీడియోలను విడుదల చేశారు. ఆయన అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్ నుంచి అవి పోస్ట్ అయ్యాయి. వీటిని ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా పొరపాటున నిలిపివేసింది. అది పాక్షికమే అయినప్పటికీ.. వివాదానికి కేంద్రబిందువు అయింది.

ఈ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. మెటాకు నోటీసులను ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఈ పరిణామాలపై తాజాగా మెటా స్పందించింది. సాంకేతికంగా చోటు చేసుకున్న లోపం కారణంగానే ఈ అపశృతి చోటుచేసుకుందని వివరణ ఇచ్చింది. తిరిగి కొద్దిసేపటికే ఆ వీడియోను పునరుద్ధరించినట్లు వివరించింది. ఈ ఎర్రర్ చోటు సంభవించినందుకు ప్రధాని మోదీకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేసింది.

Meta Issues Apology for Taking Down PM Modi Selfie Video Government Action Expected Facebook

ఓ ప్రధానమంత్రి అధికారిక అకౌంట్ లో పోస్ట్ అయిన సమాచారాన్ని గానీ, వీడియోలను గానీ ఎలా నిరోధించడం పట్ల బీజేపీ క్యాడర్ మండిపడుతోంది. ఈ వీడియోకు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ పై మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో సుమారు 36 రోజుల పాటు ఉద్రిక్తంగా సాగిన విద్యార్థుల నిరసనల నేపథ్యాన్ని ప్రధాని మోదీ ఈ వీడియోలో ప్రస్తావించారు. జెన్ జీని ఉద్దేశించి ఆయన చేసిన మొదటి అధికారిక ప్రసంగం ఇదే కావడం వల్ల దీనికి ప్రాధాన్యత ఏర్పడింది.

అలాంటి వీడియోను మెటా రిస్ట్రిక్ట్ చేయడం పట్ల అటు కేంద్రం, ఇటు బీజేపీ క్యాడర్ అసహనానికి గురైంది. ప్రధాని మోదీ వీడియోను నిలిపివేయడానికి చట్టపరమైన అభ్యర్థనలే కారణమంటూ మొదట ఫేస్‌బుక్‌ పై ఓ అధికారిక నోట్ కనిపించింది. దీనిపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. వీడియోను నిలిపివేయడానికి గల కారణాలు ఏమిటని, ఏ చట్టపరమైన విజ్ఞప్తి మేరకు ఈ వీడియోను నిలిపివేశారంటూ పలువురు బీజేపీ నేతలు మెటాను అడిగారు.

దీనిపై మెటా యాజమాన్యం వివరణలు ఇచ్చుకుంది. ప్రధాని వీడియో తొలగింపునకు ఎలాంటి చట్టపరమైన ఆదేశాలు గానీ, విజ్ఞప్తులు అందలేదని స్పష్టం చేసింది. తాత్కాలికంగా నెలకొన్న టెక్నికల్ గ్లిచ్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, పొరపాటును గుర్తించిన వెంటనే దీన్ని సరిదిద్దినట్లు పేర్కొంది. వీడియోను యథావిధిగా ఫేస్ బుక్ యూజర్లందరికీ అందుబాటులోకి తెచ్చినట్లు తెలియజేసింది. దీనికిపై విచారం వ్యక్తం చేస్తోన్నామని, జరిగిన దానికి క్షమాపణలు కోరుతున్నామని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+