అరటికాయ పెరుగు పచ్చడి ఇలా చేసుకుని తినండి..లొట్టలేస్తారు!
చాలామంది అరటికాయ తియ్యగా ఉంటుందని అరటికాయ కూర, అరటికాయ పచ్చడి చేసుకోవాలంటే ఆలోచిస్తారు. కానీ అరటి కాయ పెరుగు పచ్చడి చేసుకు తింటే చాలా సూపర్ గా ఉంటుంది. ఇందులో జీర్ణక్రియకు సహాయపడే ఫైబర్, పెరుగులోని ప్రోబయోటిక్స్ నుండి వచ్చే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. మార్కెట్ లో పచ్చి అరటికాయలు ఉన్నా చాలా మంది ఇది తయారు చేసే విధానం తెలియక తయారు చేసుకోరు.
మంచి పౌష్టికాహారంగా అరటికాయ పెరుగు పచ్చడి
ఇది మంచి ఆరోగ్యకరమైన ఆహారంగా న్యూట్రీషియన్లు చెబుతున్నారు. ఎంతో రుచికరమైన అరటి కాయ పెరుగు పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి? దీనిని ఎలా తయారు చేస్తారు? ఇది ఎందులో కలుపుకుని తింటే బాగుంటుంది? దీని స్పెషాలిటీ ఏమిటి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు
పచ్చి అరటికాయలు- 2
పచ్చిమిరపకాయలు- 10 నుండి 15 వరకు( కారాన్ని బట్టి)
వెళ్లి పాయలు- ఆరు రెబ్బలు
జీలకర్ర- రెండు టీ స్పూన్లు
ఉప్పు- రుచికి తగినంత
చింతపండు-- ఉసిరికాయంత
పెరుగు- ఒకటిన్నర కప్పు
కరివేపాకు- రెండు రెమ్మలు
పోపు గింజలు- ఒక స్పూను
నూనె- నాలుగు స్పూన్లు
తయారీ విధానము
ముందు పచ్చి అరటికాయలను శుభ్రంగా కడుక్కొని పైన పొట్టు తీయకుండానే ముక్కలుగా కట్ చేసి, పచ్చిమిరపకాయలు తొడిమలు తీసి ఒక పాన్ లో రెండు స్పూన్ల నూనె పోసి అరటికాయ ముక్కలు పచ్చిమిరపకాయలను కలిపి వేయించుకోవాలి. అందులో ఉసిరికాయంత చింతపండును యాడ్ చేయాలి. అరటికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
అరటికాయ, పెరుగు పచ్చడి ఇలా చేసుకు తింటే సూపర్ టేస్టీ
పచ్చడిని రోట్లో కానీ, మిక్సీలో కానీ రుబ్బుకోవచ్చు. పచ్చడిని మెత్తగా రుబ్బుకోవటానికి అరటికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, చింతపండు, వెల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సీ వేసుకోవాలి. ఆ తర్వాత అందులో పెరుగు కలిపి, పొయ్యి మీద పాన్ పెట్టి అందులో రెండు స్పూన్ల నూనె వేసి, నూనె వేడి అయిన తర్వాత అందులో పోపు గింజలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి పోపు చేసుకోవాలి. ఇక వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుంది. ఇది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది.












Click it and Unblock the Notifications