Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

డయాబెటిస్ ఉంటే అరటి పండ్లు తినొద్దు అనేది అపోహేనా!

ప్రస్తుత సమాజంలో డయాబెటిస్ పేషెంట్స్ ఎక్కువైపోయారు. డయాబెటిస్ వచ్చింది అంటే ఇది తినకూడదు అది తినకూడదు అన్న రిస్ట్రిక్షన్స్ కూడా ఎక్కువ అయిపోతాయి. మంచి పోషకాలు ఉండే ఆహారం కూడా తినకూడదు అని చెప్పే పరిస్థితి ఉంటుంది. అయితే అటువంటి ఆహారాలలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అరటిపండు.

డయాబెటిస్ బాధితులు అరటిపండు తినొచ్చా

అరటిపండులో బోలెడన్ని పోషకాలు ఉంటాయి. అవి మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అరటి పండులో ఉండే పొటాషియం, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్, ఫైబర్, కొవ్వు వంటి ముఖ్యమైన పోషకాలు మన శరీర ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి. అటువంటి అరటి పండ్లను డయాబెటిస్ బాధితులు తినకుండా ఉండాలని చాలామంది చెబుతూ ఉంటారు.

Myth that you shouldn t eat bananas if you have diabetes eat banana in this way

డయాబెటిస్ బాధితులు అరటి పండు ఇలా తినొచ్చు

డైటీషియన్లు చెబుతున్న దాని ప్రకారం డయాబెటిస్ బాధితులు అరటిపండు తినకూడదు అనేది ఒక అపోహ మాత్రమే. డయాబెటిస్ బాధితులు ప్రతిరోజు అరటిపండు తినొచ్చు. అయితే అరటి పండు తినడానికి ఒక విధానం అనేది ఉంటుంది. డయాబెటిస్ బాధితులు ప్రతిరోజు ఉదయం వేళల్లో ఒక్క అరటిపండు మాత్రమే తినవచ్చు. ఇందులో సహజ చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల, దానిని ప్రోటీన్ మూలంతో కలిపి తీసుకుంటే మరీ మంచిది.

ఇలాంటి అరటిపండ్లు తినొద్దు

ఇతర ప్రోటీన్ ఆహారాలతో కలిపి ఒక అరటిపండును తినడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ అసలు పెరగవు. అరటిపండు గ్లైసిమిక్ ఇండెక్స్ 51. ఇందువల్లనే అరటి పండ్లు తింటే త్వరగా షుగర్ పెరుగుతుందని చెబుతారు. అందుకే ఉదయం పూట ఒక అరటిపండును, ప్రోటీన్ ఆహారాలతో కలిపి తీసుకుంటే మంచిది. పొరపాటున కూడా బాగా పండిన అరటి పండ్లను తినకూడదు.

అరటిపండు ఈ సమయాల్లో అసలే తినొద్దు

అరటి పండు పైన గోధుమ రంగు మచ్చలు ఉన్న అరటి పండ్లను తింటే షుగర్ పెరుగుతుంది. అంతేకాదు అరటిపండును రాత్రి వేళల్లో అస్సలు తినకూడదు. ఉదయం పూట మాత్రమే ఒక్క అరటిపండు మాత్రమే తింటే మంచిది. అరటి పండులో ఉండే పోషకాలు మన శరీరానికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తాయి. కనుక షుగర్ పేషెంట్ లు నిరభ్యంతరంగా ఒక్క అరటిపండును ప్రతిరోజు తినవచ్చు. అయితే విపరీతంగా షుగర్ లెవెల్స్ ఉంటే మాత్రం అరటిపండు తినకండి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+