రోజూ రాత్రిళ్లు చపాతి తింటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే...!!
ఈ మధ్య కాలంలో మారుతున్న జీవన శైలి అనారోగ్యానికి కారణం అవుతోంది. ఆహారపు అలవాట్లు కొత్త సమస్యలు తెస్తున్నాయి. ఇదే సమయంలో కొంత మంది వేగంగా తమ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుంటున్నారు. తమ డైట్ నుంచి రైస్‌ను తీసేసి చపాతీ తింటూ ఉంటారు. కొంతమంది ప్రతీ రోజూ రాత్రి చపాతీ తింటూ ఉంటారు. రెండు లేదా మూడు చపాతీలు తిని భోజనాన్ని ముగిస్తుంటారు. ఇలా ప్రతీ రోజూ రాత్రి చపాతీ తినటం ఎంత వరకు మేలు?.. రాత్రి పూట చపాతీ తినటం లాభమా.. నష్టమా అనే సందేహాలు ఉన్నాయి. చపాతీలు తీసుకోవటం వలన ఏం జరుగుతుందనేది నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
ప్రస్తుత కాలంలో చాలా మంది ఫేస్ చేసే ప్రధాన సమస్య డయాబెటీస్. దీన్ని నియంత్రణలో ఉంచుకోవాలంటై సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే డయాబెటీస్ ఉన్నవారు నైట్ డిన్నర్‌లోకి చపాతీ, రైస్ తినే విషయంలో చాలా గందరగోళానికి గురవుతారు. చపాతీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పరిశోధనల ప్రకారం చపాతీలు గుండె ఆరోగ్యానికి ప్రయోజన కరంగా గుర్తించారు. బరువు తగ్గడానికీ చపాతీలు మంచి ఆహారం అని నిపుణులు అంటున్నారు. రోజూ రెండు సాధారణ సైజు చపాతీలను తినడం వల్ల ఇందులో ఉండే అధిక పీచు ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుందని వివరించారు. ఇందులోని పీచు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి కృషి చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం, అజీర్తి, గ్యాస్.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలున్న వారు నిపుణుల సలహా మేరకు రోజూ చపాతీని ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు.

అదే విధంగా చపాతీని పోషకాల సమ్మేళనంగా చెబుతారు.ఇందులో బి, ఇ విటమిన్లతో పాటు క్యాల్షియం, జింక్, కాపర్, అయొడిన్, మాంగనీస్, సిలికాన్, పొటాషియం.. వంటి ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. చపాతీల్లో ఉండే అధిక ఐరన్ స్థాయులు శరీరంలో హెమోగ్లోబిన్ స్థాయిని క్రమబద్ధీకరిస్తాయని నిపుణులు వెల్లడించారు. ఫలితంగా రక్తహీనత తలెత్తకుండా జాగ్రత్తపడచ్చని సూచిస్తున్నారు. చపాతీలో ఉండే సెలీనియం క్యాన్సర్ కారకాలు శరీరంపై దాడి చేయకుండా కాపాడుతాయని వివరించారు. కాగా, చపాతీ ఆరోగ్యానికి మంచిదే కదా అని ఎక్కువ నూనె, నెయ్యితో చేసుకోవడం వల్ల శరీరంలో అనవసర కొవ్వులు చేరతాయని నిపుణులు హెచ్చరిక చేస్తున్నారు. ముడిగోధుమలు తీసుకొని స్వయంగా పట్టించుకొని ఆ పిండితో చపాతీ చేసుకుంటే మంచిది. గోధుమపిండికి రాగి, సోయాబీన్, చిరుధాన్యాలతో చేసిన పిండిని కూడా కలుపుకొని చపాతీ తయారుచేసుకోవచ్చని చెబుతున్నారు. లేదంటే బయట దొరికే మల్టీగ్రెయిన్ పిండిని వాడుకోవాలని సూచిస్తున్నారు. కాగా, చపాతీలను పరిమితంగా తీసుకున్న వరకు సమస్య ఉండదని.. దాటితే మాత్రం సమస్యలు ఏర్పడే అవకాశం ఉందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications