"రొయ్యలు - బెండకాయ పులుసు" ఈ కాంబోని మించిన టేస్ట్ లేదంతే..

పుల్లగా, కారంగా, నోరూరించే రుచితో ఉండే పచ్చి రొయ్యలు - బెండకాయ పులుసు ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపించే వంటకం. తీర ప్రాంతాల్లో సాధారణంగా చేపల పులుసులో బెండకాయ, మామిడికాయలు వేసి చేసే ప్రత్యేక రుచి చాలా ప్రసిద్ధి. అదే తరహా రుచిని ఈసారి రొయ్యల పులుసులో బెండకాయలతో పొందవచ్చు. రొయ్యల సాఫ్ట్‌నెస్, బెండకాయల టేస్ట్, చింతపండు పుల్లదనం కలిసి ఈ పులుసును మరింత ప్రత్యేకంగా చేస్తాయి.

అన్నంతో పాటు రాగి సంగటి, జొన్న రొట్టెలతో తింటే దీని రుచి మరింత అద్భుతంగా ఉంటుంది. ఈ పులుసు రుచికరంగానే కాకుండా పోషక విలువల పరంగానూ మేలు చేస్తుంది. రొయ్యల్లో ప్రోటీన్ పుష్కలంగా ఉండగా, బెండకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. జీర్ణక్రియకు మంచిది, తక్కువ సమయంలో సులభంగా తయారయ్యే ఈ వంటకం రోజువారీ భోజనానికి కూడా చక్కగా సరిపోతుంది. ఈ వంటకం ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

okra-and-prawns-curry-making-recipe-in-telugu

కావాల్సిన పదార్థాలు:

రొయ్యలు - 750 గ్రాములు,
బెండకాయలు - పావు కిలో,
చింతపండు - 30 గ్రాములు,
ఉప్పు - తగినంత,
పసుపు - పావు స్పూన్,
నిమ్మరసం - ఒక నిమ్మకాయది,
నూనె - 5 టేబుల్ స్పూన్లు,
ఆవాలు, మెంతులు, జీలకర్ర - అర స్పూన్ చొప్పున,
వెల్లుల్లి - 8 రెబ్బలు,
పచ్చిమిర్చి - 4,
ఉల్లిపాయలు - 2,
టొమాటో - 1,
కరివేపాకు - ఒక రెమ్మ,
కారం - 2 టీ స్పూన్లు,
ధనియాల పొడి - 1 టీ స్పూన్,
జీలకర్ర పొడి - అర టీ స్పూన్,
గరం మసాలా - అర టీ స్పూన్,
కొత్తిమీర తరుగు - అర కట్ట.

తయారీ విధానం:

ముందుగా రొయ్యలను శుభ్రంగా శుభ్రపరచాలి. గిన్నెలో రొయ్యలు వేసి ఉప్పు, పసుపు, నిమ్మరసం కలిపి బాగా కలిపి మరోసారి నీటితో కడగాలి.

ఇలా రెండు మూడు సార్లు కడిగితే రొయ్యల నుంచి వచ్చే వాసన పూర్తిగా తగ్గిపోతుంది. తరువాత రొయ్యలకు కొద్దిగా ఉప్పు, పసుపు, కారం వేసి 10 నిమిషాలు మ్యారినేట్ చేయాలి.

చింతపండును గోరువెచ్చని నీటిలో 10 నిమిషాలు నానబెట్టి రసం పిండి పెట్టుకోవాలి. బెండకాయలను కడిగి చివర్లు తీసి మీడియం సైజు ముక్కలుగా కట్ చేయాలి. ( ఇలా ముందే సిద్ధం చేసుకుంటే వంట త్వరగా అవుతుంది)

ఇప్పుడు స్టవ్‌పై ప్యాన్ పెట్టి నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కగానే ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి.

తరువాత వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి ఉల్లిపాయలు మెత్తబడే వరకు వేయించాలి. ఆపై టొమాటో ముక్కలు వేసి బాగా మగ్గించాలి.

ఇప్పుడు మ్యారినేట్ చేసిన రొయ్యలను ప్యాన్‌లో వేసి మీడియం మంటపై కలుపుతూ వేయించాలి.

రొయ్యల నుంచి వచ్చే నీరు పూర్తిగా ఇంకి, నూనె పైకి తేలే వరకు వేయిస్తే రుచి బాగా వస్తుంది.

ఆ తర్వాత మంట తగ్గించి కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి.

ఇప్పుడు బెండకాయ ముక్కలు వేసి, కొద్దిగా ఉప్పు చేర్చి రెండు మూడు నిమిషాలు మగ్గించాలి.

బెండకాయలు కొంచెం వేగిన తర్వాత చింతపండు రసం, అవసరమైనంత నీళ్లు పోసి, రుచి చూసుకుని ఉప్పు-కారం సరిచేసుకోవాలి.

మూత పెట్టి మీడియం మంటపై ఐదు నుంచి ఆరు నిమిషాలు మగ్గించాలి.

చివరగా మూత తీసి అర టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర తరుగు వేసి కలపాలి.

స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచితే పులుసు రుచులు అన్నీ బాగా కలిసిపోతాయి.

ఇప్పుడు వేడి వేడిగా అన్నంతో వడ్డిస్తే పచ్చి రొయ్యలు - బెండకాయ పులుసు రుచి మరింత బాగుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+