Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రూపాయి ఖర్చు లేకుండా అందం కోసం సూపర్ చిట్కా!

ఆరోగ్యంగా, అందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. ఎవరైనా సరే అందంగా, ఆనందంగా ఉండాలనే కోరుకుంటారు. భారతీయులు ఇప్పుడు '30 రోజుల వాటర్ ఛాలెంజ్'ను ప్రయత్నిస్తున్నారు. దాని నుండి మంచి ఫలితాలను చూస్తున్నారు. అసలు ఏమిటీ వాటర్ ఛాలెంజ్? ఎందుకు దీనిని ఇప్పుడు ఎక్కువ మంది ట్రై చేస్తున్నారు? అంటే

నీరు సరిపడా తాగకుంటే చర్మ ఆరోగ్యానికి హాని

నీరు చర్మ ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తాయి అనే విషయం అందరికీ తెలిసిందే . అయితీ నీళ్ళు శరీరానికి కావలసినంత తీసుకోకపోయినా, అవసరం కంటే ఎక్కువ తీసుకున్నా ఇబ్బందే. నీరు శరీరానికి కావాల్సినంత తీసుకోకపోతే అనవసరపు అనారోగ్యం వస్తుంది. అందం కూడా దెబ్బ తింటుంది. ముఖం మీద ముడతలు వచ్చే ప్రమాదం కూడా ఉంది.ముఖంపై పిగ్మెంటేషన్, మొటిమల మచ్చలు, డ్రైస్కిన్ కూడా నీళ్ళు తక్కువగా తీసుకునే వారిలో వస్తాయి.

one-month-water-challenge-a-super-tip-to-reduce-your-age-without-spending-a-single-rupee

కావాల్సినంత నీరు తాగితే చర్మ ఆరోగ్యం

శరీరానికి కావాల్సిన మోతాదులో నీరు తాగడం సాధారణ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది. సరైన హైడ్రేషన్ చర్మం యొక్క రక్షణపొరను స్థిరంగా ఉంచుతుంది. ఇది చర్మం నిండుగా, కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. పెద్దలకు రోజుకు సుమారు రెండు నుండి మూడు లీటర్ల నీరు అవసరం. శరీర అవసరాన్ని బట్టి నీరు తాగితే చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. అయితే అతిగా నీరు తాగడం శరీరలవణాల సమతుల్యత దెబ్బతీసి ఆరోగ్యానికి హానికరం కావచ్చు.

ఎక్కువ వాటర్ తాగినా నష్టమే

కొన్ని చర్మ సమస్యలు నీరు త్రాగటం కారణంగానే తగ్గకపోవచ్చు కానీ నీరు త్రాగటం చాలా వరకు చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. త్వరగా వృద్ధాప్యం రాకుండా కాపాడుతుంది. 30 రోజుల వాటర్ ఛాలెంజ్ చేసేవారు కూడా ఒక క్రమ పద్దతిలో నీరు తాగాలి, ఎక్కువగా తాగితే మళ్ళీ ఆరోగ్య నష్టం ఉంటుంది.

వాటర్ ఛాలెంజ్ ఇలా చేస్తే బెస్ట్ రిజల్ట్స్

వాటర్ ఛాలెంజ్ లో భాగంగా నెలరోజులు క్రమం తప్పకుండా శరీరాన్ని హైడ్రేట్ చేసేవారు నెలరోజుల ముందు కంటే మెరుగైన కాంతివంతమైన చర్మాన్ని చూస్తారు. అయితే నీరు మన ఆరోగ్య రక్షణలో, చర్మ సంరక్షణలో ఒక భాగమే, మిగతా ఆహారం, నిద్ర, ఒత్తిడి లేని జీవితం ఇవన్నీ భాగం తీసుకుంటాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+