ఆంధ్రా స్టైల్ 'పప్పు చెక్కలు'.. ఇలా చేస్తే కరకరలాడుతాయి అంతే..!

తెలుగింటి రుచుల్లో ప్రధానమైనవి పప్పు చెక్కలు.. ఇంట్లో ఏ శుభకార్యం అయినా సింపుల్ గా చేసుకునే వంటకాల్లో పప్పు చెక్కలు ముందుంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ ఈ చెక్కల్ని ఇష్టంగా తింటారు. పంటికింద కరకరలాడుతూ ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అయితే చాలా మంది ఈ చెక్కలు చేసుకున్నప్పుడు టేస్టీగా, క్రిస్పీగా రావట్లేదని ఫీల్ అవుతుంటారు. మరి సులభంగా ఈ పప్పు చెక్కలను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు..? తయారీ విధానం.. పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

ఆంధ్రా స్టైల్ 'పప్పు చెక్కలు' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే బియ్యం పిండి రెండు కప్పులు, శనగపప్పు(నానబెట్టినది) రెండు టేబుల్ స్పూన్ లు, జీలకర్ర ఒక టేబుల్ స్పూన్, నువ్వులు ఒక టేబుల్ స్పూన్, కారం పొడి ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి రెండు తరిగినవి, కరివేపాకు ఒక కప్పు సన్నగా తరిగినది, వెన్న లేదా వేడి నూనె రెండు టేబుల్ స్పూన్ లు, ఉప్పు తగినంత, నీరు తగినంత, నూనె డీప్ ఫ్రై కోసం తగినంత తీసుకోవాలి. ఇప్పుడు తయారీ విధానం చూస్తే..

ఇప్పుడు ఒక గిన్నెలో బియ్యం పిండి, ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. ఇప్పుడు అందులో వెన్న లేదా వేడి నూనె వేయాలి. అలా చేతితో బాగా కలిపి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీరు పోయాలి. అటు గట్టిగా ఇటు మెత్తగా కాకుండా పిండిని కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ప్లాస్టిక్ ప్లేట్ లేదా అరిటాకు మీద కొద్దిగా నూనె రాసి చిన్న నిమ్మకాయ సైజంత పిండిని తీసుకుని చేతితో పలుచగా ఒత్తుకోవాలి.

PappuChekkalu recipe Andhra-style How to make them Required ingredients full Preparation method

ఇప్పుడు బాణలిలో నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత మధ్యస్థ మంటపై ఒక్కొక్క పప్పు చెక్కను నెమ్మదిగా వేయాలి. ఇప్పుడు జాగ్రత్తగా నూనెలో వేయించుకోవాలి. ఇప్పుడు రెండు వైపులా బంగారు రంగు వచ్చి కరకరలాడే వరకు వేయించుకుని తీసేయాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. అంతే సూపర్ టేస్టీ ఆంధ్రా స్టైల్ 'పప్పు చెక్కలు' రెడీ అయినట్టే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+