కోడిగుడ్డుతో లాభాలే, ఈ సమస్యలు ఉన్న వారు తింటే డేంజర్..!!
కోడిగుడ్డు సంపూర్ణ పౌష్టికాహారం. ఆరోగ్య పరంగా మేలు చేస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. రోజుకు ఒక గుడ్డును తీసుకోవటం ద్వారా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు చెబుతారు. గుడ్డులో కావాల్సిన ప్రొటీన్స్... మినరల్స్ లభ్యం అవుతాయి. గుడ్డుతో పలు రకాల వంటకాలు చేసుకోవటం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. అయితే , కొన్ని రకాల సమస్యలు ఉన్న వారు మాత్రం కోడిగుడ్డుకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మరి.. కోడిగుడ్లు ఎవరు తిన కూడదు... నిపుణులు ఏం చెబుతున్నారు..
కోడిగుడ్డు అన్ని వయసుల వారికి పౌష్టికాహారం. మధుమేహం ఉన్న వారు కోడిగుడ్డు తినటం పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, షుగరు వ్యాధి గ్రస్తులు తాము చికిత్స తీసుకుంటున్న వైద్యుడి సూచనల మేరకే తీసుకోవటం మంచింది. ఇక.. చర్మ అలర్జీలు ఉన్నవారు కోడిగుడ్డును తీసుకోకపోవటం ఉత్తమమని చెబుతున్నారు. అలర్జీలు ఉన్న వారందరికీ కోడిగుడ్డు రియాక్షన్ కలిగించక పోవచ్చు. కొందరికి మాత్రం సమస్యలు ఉంటాయి. ఇటువంటి వారు కోడిగుడ్డు తిన్న తరువాత వాంతులు, విరేచనాలు అవడం, చర్మంపై దురదలు వంటి లక్షణాలతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొందరికి కోడిగుడ్లను తిన్న తరువాత కడుపు ఉబ్బరంగా మారుతుంది. సరిగ్గా జీర్ణం అవ్వదు. ఆ తరువాత మలబద్దక సమస్య ఏర్పడుతుంది. ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారు కోడిగుడ్లకు దూరంగా ఉండటం మంచింది.

ఇక, మూత్ర పిండాల్లో రాళ్ల సమస్య ఉన్న వారికి కోడిగుడ్డు మంచిది కాదని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. కోడిగుడ్లలో ఉండే క్యాల్షియం కారణంగా కిడ్నీ లో స్టోన్స్ కరిగే గుణాన్ని తగ్గిస్తుంది. మరింత పెంచే అవకాశమూ ఉంటుంది. స్టోన్స్ వచ్చి తగ్గిన వారు లేదా ఆ సమస్యతో ఇంకా బాధ పడుతున్న వారు గుడ్లను తినక పోవటం మంచింది. అదే విధంగా అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నవారు కూడా కోడిగుడ్లను తినకూడదు. అధికంగా కొలెస్ట్రాల్ ఉంటే శరీరంలో ఎల్‌డీఎల్ పెరిగి.. రక్త నాళాల సమస్యలతో గుండె పైన ప్రభావం పడుతుంది. వీరు వైద్యుల సూచన మేరకే కోడిగుడ్లు తీసుకోవటం మంచింది. గుండె సమస్యలు, హైబీపీ ఉన్నవారు సైతం వైద్యుల సూచనలతోనే వినియోగించాలి. ఇక, రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉన్నవారు.. టైపా యిడ్ వంటివి వచ్చిన వారు సైతం కోడి గుడ్డు తినే విషయంలో వైద్యుల సూచన తీసుకోవాలి.












Click it and Unblock the Notifications