రేగుపండ్లు తింటున్నారా?
రేగుపండ్లు పేరు వింటే వెంటనే నోట్లో నీళ్లు ఊరడం సహజం. అవి పుల్లగా, తియ్యగా ఉంటాయి కాబట్టే వీటిని ఎక్కువగా ఇష్టపడతారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా రేగు పండ్లను తింటారు. వీటితో పచ్చడి కూడా పెట్టుకుంటారు. ఈ చెట్టు బెరడును ఉపయోగించి చేసే కషాయాన్ని మలబద్దకం నివారణకు ఉపయోగిస్తారని ఆయుర్వేదం చెబుతోంది. వీటి ఆకులను నూరి గాయాల పై పూస్తే వెంటనే తగ్గిపోతాయి. ఇవే కాకుండా మరెన్నో రోగాలను నయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కడుపులో మంటను తగ్గించి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తాయి. బరువు పెరగడంలో, కండరాలకు బలాన్ని ఇవ్వడంలో, శారీరక శక్తిని కల్పించడంలో ఉపయోగపడతాయి. చలికాలంలో వీటిని తీసుకోవడంవల్ల జలుబు, దగ్గు వస్తాయనే అపోహలో చాలామంది ఉంటారు. కానీ అది తప్పు అని నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవి తింటే చలికాలంలో ఎక్కువగా వచ్చే కీళ్లనొప్పులను కూడా తగ్గిస్తాయని చెబుతున్నారు.

ఈ పండ్లు రక్తాన్ని శుభ్రం చేస్తాయి. ఆకలి లేమి, రక్తహీనత, నీరసం, గొంతునొప్పి వంటి సమస్యలకు ఇది ఉపశమనం. నిద్ర లేమి సమస్యను తగ్గించటంలో, జుట్టు ఆరోగ్యంగా,ఒత్తుగా పెరగడంలో రేగుపండ్లు బాగా సహాయపడతాయి. రేగు పేస్టును చర్మంపై పూయడం వల్ల గాయం నయమవుతుంది. చర్మం మృదువుగా ఉంటుంది. రేగుపండ్లలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు వుండటం వల్ల ఇన్ఫెక్షన్ ల బారిన పడకుండా చూస్తుంది.
రేగుపళ్లు పొటాషియం, పాస్ఫరస్, మాంగనీస్, ఐరన్, జింక్ పోషకాల్ని కలిగి వుంటాయి. జీర్ణశక్తికి, ఆకలి పెరుగుదలకు, రక్తహీనతను నివారించడానికి, విసుగు, నీరసం, శ్వాస నాళాల వాపు నెమ్మదించడానికి, గొంతునొప్పికి, హిస్టీరియా లాంటి వ్యాధుల నివారణకు ఉపయోగిస్తారు.












Click it and Unblock the Notifications