ఆ స్టార్ హీరో ఫేవరెట్ "బంగాళ దుంప - దోసకాయ" కర్రీ ఎలా చేయాలంటే..?

బంగాళదుంప, దోసకాయలతో ఎన్నో వంటకాలను తేవలుగు రాష్ట్రాల్లో చేస్తూ ఉంటారు. అయితే ఈ రెండింటిని కలిపి కూడా చేసే కూర ఆంధ్ర స్టైల్‌లో చాలా ప్రసిద్ధి. తేలికగా జీర్ణమయ్యే ఈ వంటకం చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చేస్తుంది. బంగాళదుంపల మృదుత్వం, దోసకాయ యొక్క తేలికపాటి పులుపు కలిసిపడి ప్రత్యేకమైన రుచిని ఇస్తాయి. అందుకే ఈ బంగాళదుంప-దోసకాయ కూర వేడి వేడి అన్నంతో, నెయ్యితో, పప్పుతో లేదా చపాతీతో తింటే మరింత రుచిగా ఉంటుంది. లంచ్ బాక్స్‌కు కూడా ఇది మంచి ఆప్షన్.

అయితే దోసకాయను ఎక్కువగా ఉడికిస్తే అది గుజ్జుగా మారుతుంది కాబట్టి సమయం పాటించాలి. అలానే బంగాళదుంపలు పూర్తిగా ఉడికిన తర్వాతే స్టవ్ ఆఫ్ చేయాలి. వీటితో పాటే ఉప్పు, కారం పరిమాణం దోసకాయ పులుపును బట్టి సర్దుబాటు చేసుకోవాలి. ఈ రెండిటి కాంబోలో చేసే వంట తనకు ఎంతో ఇష్టమని రీసెంట్ గానే ఓ హీరో ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడంతో ఈ క్రేజీ కాంబో వంటకం మళ్లీ వార్తల్లో నిలుస్తుంది. ఈ టేస్టీ రెసిపీ మీకోసం ప్రత్యేకంగా..

potato-cucumber-curry-making-reicpe-in-telugu-with-easy-steps-and-best-tips-for-serving

కావలసిన పదార్థాలు

బంగాళదుంపలు - 2 (మధ్యస్థ పరిమాణం, ముక్కలుగా కోసినవి)

దోసకాయ - 1 (తొక్క తీసి, గింజలు తీసి చిన్న ముక్కలు)

ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)

పచ్చిమిర్చి - 3 (చీలికలు)

నూనె - 2 టేబుల్ స్పూన్లు

ఆవాలు - ½ టీస్పూన్

జీలకర్ర - ½ టీస్పూన్

ఎండుమిర్చి - 1

కరివేపాకు - కొద్దిగా

పసుపు - ½ టీస్పూన్

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్

కారం - 1 టీస్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

గరం మసాలా - చిటికెడు (ఐచ్చికం)

కొత్తిమీర - తరిగింది

తయారీ విధానం..

ముందుగా ఒక బాణలిలో నూనె వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి.

తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోధుమ రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు బాగా కలపాలి.

ఇప్పుడు బంగాళదుంప ముక్కలు వేసి పసుపు, ఉప్పు కలిపి మూత పెట్టి 5-7 నిమిషాలు మగ్గనివ్వాలి. (బంగాళదుంపలు గట్టిగా ఉండటంతో ముందుగా వీటిని ఉడికించడం ముఖ్యం)

బంగాళదుంపలు సగం ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. (దోసకాయలో చేదు లేకుండా ముందుగా ఒక ముక్క రుచి చూసుకోవడం మంచిది.)

కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుతూ కూర కింద అంటుకోకుండా జాగ్రత్త పడాలి.

కూర దగ్గరపడిన తర్వాత గరం మసాలా (ఐచ్చికం) చల్లి, కొత్తిమీరతో గార్నిష్ చేసి స్టవ్ ఆఫ్ చేయాలి.

అదనపు చిట్కాలు..

చివరలో కొంచెం పాలు వేసుకుంటే కూర మృదువుగా, క్రీమీగా ఉంటుంది

కొబ్బరి తురుము లేదా కొబ్బరి పేస్ట్ కలిపితే రుచి మరింత పెరుగుతుంది

పులుపు ఎక్కువగా కావాలంటే కొద్దిగా చింతపండు రసం కూడా వేసుకోవచ్చు

మసాలా ఎక్కువగా ఇష్టపడేవారు గరంమసాలా లేదా మిరియాల పొడి చేర్చవచ్చు

తక్కువ నూనెతో కూడా ఈ కూరను ఆరోగ్యకరంగా తయారు చేయవచ్చు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+