"రొయ్యల బిర్యానీ" ఇలా ట్రై చేస్తే.. ఆ టెస్టే వేరబ్బా !!

మారుతున్న కాలానుగుణంగా ప్రజల ఆహారపు అలవాట్లు కూడా మారుతూ వస్తున్నాయి. అయితే ముక్క లేనిదే ముద్ద దిగదు అనే వాళ్లు చాలా మందే ఉన్నారు. ఈ కోవలోకే వస్తుంది సీ ఫుడ్ కూడా. సముద్రపు ఆహారం అంటే చాలా మందికి ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. మరి ముఖ్యంగా చేపలతో పాటు ఎక్కువగా తినేవీ అంటే రొయ్యలు అనే చెప్పాలి. రొయ్యల కూర, రొయ్యల ఫ్రై, రొయ్యల పులుసు.. ఇలా ఏ వెరైటీ అయినా కానీ ఎంతో ఇష్టంగా తింటుంటారు.

ఇక రొయ్యల బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సాధారణంగా మనం ఈ బిర్యానీని హోటల్లో ఆర్డర్ చేస్తుంటాం. కానీ రెస్టారెంట్‌కి వెళ్లకుండానే అదే రుచిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ టిప్స్ ఫాలో అయితే రెస్టారెంట్ లో లాగానే బెస్ట్ టేస్టీ రొయ్యల బిర్యానీ చేసుకోవచ్చు. అది ఎలానో మీకోసం ప్రత్యేకంగా..

prawn-biryani-making-in-restaurant-in-style

రొయ్యల బిర్యానీకి కావాల్సిన పదార్థాలు..

  • రొయ్యలు - 250 గ్రాములు
  • బాస్మతి బియ్యం - 1 కప్పు
  • ఉల్లిపాయలు - 1 పెద్దది (సన్నగా తరిగినవి)
  • టమాటాలు - 1 మధ్యస్థ పరిమాణం
  • పచ్చిమిర్చి - 3 (చీల్చినవి)
  • అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
  • పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
  • బిర్యానీ మసాలా - 1 టేబుల్ స్పూన్
  • నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
  • కొత్తిమీర - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినది)
  • పుదీనా ఆకులు - ఒక ముత్తి
  • నిమ్మకాయ - 1
  • ఉప్పు - రుచికి సరిపడా
  • నూనె - అవసరమైనంత

దినుసులు :

బే లీఫ్, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు - తగినంత

కుంకుమపువ్వు - కొద్దిగా (1 టేబుల్ స్పూన్ వేడి పాలలో నానబెట్టినది)

వేయించిన ఉల్లిపాయలు (ఫ్రైడ్ అనియన్స్) - గార్నిష్‌కి

రొయ్యల ప్రిపరేషన్..

రొయ్యలను శుభ్రంగా కడిగి, తలలు, తోకలు తొలగించాలి. ఆ తర్వాత వాటిని కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపిన నీటిలో 10 నిమిషాలు ఉంచాలి. ఇలా చేస్తే దుర్వాసన పోతుంది. అనంతరం లైట్ గా వేయించి పక్కన పెట్టుకోవాలి. (బాగా వేయిస్తే గట్టిపోతాయి, కాబట్టి తేలికగా మాత్రమే ఫ్రై చేయాలి). అలానే బాస్మతి బియ్యాన్ని బాగా కడిగి 30 నిమిషాలు నీటిలో నానబెట్టాలి.

వంట చేసే విధానం..

  • ఒక పెద్ద పాత్రలో నీరు మరిగించి అందులో ఉప్పు, కొద్దిగా నూనె, యాలకులు వేసి బియ్యం వేసి 70% వరకు ఉడికించాలి.
  • ఆ తర్వాత నీరు వడగట్టి పక్కన పెట్టాలి.
  • పాన్‌లో నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి.
  • బే లీఫ్, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి.
  • ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేగించాలి.
  • ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, టమాటా వేసి 5 నిమిషాలు వేపాలి.
  • పెరుగు, బిర్యానీ మసాలా, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి.
  • ఈ మసాలాలో ముందుగా వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసి బాగా కలపాలి.
  • రొయ్యల నుంచి తేమ బయటకు వస్తుంది కాబట్టి మసాలా మరింత రుచిగా మారుతుంది.
  • ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర కొంత వేసి కలపాలి.
  • చివరగా ఇప్పుడు పాన్‌లో బియ్యం సగం పరిమాణం వేసి, దానిపై రొయ్యల మసాలా పొర వేయాలి.
  • మిగిలిన బియ్యం వేసి, కుంకుమపువ్వు పాలు, వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసి మూత పెట్టాలి.
  • పాన్‌కి కింద తక్కువ మంట ఉంచి, పైభాగాన బరువైన మూత లేదా పిండితో సీలు చేసి దమ్ బిర్యానీ విధంగా 15-20 నిమిషాలు ఉంచాలి.
  • దీన్ని కొంచెం ఉల్లిపాయ, బాయిల్ చేసిన గుడ్డు, నిమ్మముక్కలుతో పాటు సర్వ్ చేస్తే రెస్టారెంట్ రుచిని ఇంట్లోనే ఆస్వాదించవచ్చు.

చిట్కాలు..

  • రొయ్యలను ఎక్కువ సేపు ఉడికిస్తే అవి రబ్బరులా గట్టిపోతాయి. కాబట్టి 5 నిమిషాలు సరిపోతుంది.
  • బాస్మతి బియ్యాన్ని 70% మాత్రమే ఉడికించాలి; డమ్ వేస్తున్నప్పుడు మిగిలిన భాగం పూర్తవుతుంది.
  • నెయ్యి, పెరుగు, పుదీనా కలయికే బిర్యానీకి ప్రాణం - వాటిని తప్పక వాడాలి.
  • మసాలా తక్కువగా ఇష్టపడేవారు బిర్యానీ మసాలా పరిమాణం తగ్గించుకోవచ్చు.

ఇలా చేస్తే రెస్టారెంట్‌లను మించిన రుచితో ఇంట్లోనే సులభంగా రొయ్యల బిర్యానీ తయారవుతుంది. రుచికరమైన, సువాసనగల ఈ బిర్యానీని కుటుంబ సభ్యులతో కలిసి తింటే ఆనందం రెట్టింపు అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+