పరీక్షల టైమ్ లో పిల్లలకు ఈ ఫుడ్స్ పెడితే.. ఫలితం మీరు కోరుకున్నట్లే..!!
పరీక్షల సీజన్ మొదలవుతోంది. ఇప్పటికే అన్ని ప్రధాన పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. పేరెంట్స్ కు టెన్షన్ టైం మొదలైంది. అటు స్కూళ్లల్లో.. ఇటు ఇంట్లో పిల్లల పైన పరీక్షల ఒత్తిడి అన్ని రకాలుగా పెరిగిపోతుంది. ర్యాంకుల కోసం స్కూళల్లో అదే పనిగా చదివించటం సాధారణంగా మారిపోయింది. అయితే, పరీక్షలు.. ఒత్తిడి మధ్య పిల్లలకు ఎలాంటి ఆరోగ్యం మంచింది. వారికి ఏ ఆహారం శక్తిని పెంచుతోంది. మానిసికంగా బలాన్ని అందిస్తుంది. చదవటంతో పాటుగా మంచి పోషకాహారం వారు మంచి ఫలితాలు సాధించటానికి దోహదం చేస్తుంది. దీంతో.. పరీక్షల సమయం లో పిల్లలకు ఇవ్వాల్సిన ఆహారం గురించి నిపుణులు సూచనలు చేస్తున్నారు.
పరీక్షల సమయంలో పిల్లల్లో ఒత్తిడిని తగ్గించడానికి తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలని నిపుణులు చిస్తున్నారు. ఇందులో భాగంగా.. మార్కులు ఎక్కువగా తెచ్చుకోవాలని కండిషన్లు పెట్టొద్దని చెబుతున్నారు. దాంతోపాటు వారికి మంచి పోషకాహారం అందించాలని సూచిస్తున్నారు. పిల్లలకు ప్రత్యేకంగా వాల్ నట్స్, అవిసె గింజలు, బాదం, పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు వంటి వాటిల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ E ఉంటాయి. ఇవి జింక్ ను కూడా అందిస్తాయి. వీటి ద్వారా పిల్లలు మానసికంగా చురుగ్గా ఉంటారు. ఇక.. ఎగ్జామ్స్ టైమ్ లో పిల్లలకు ఓట్స్ కూడా బెస్ట్ ఫుడ్ అంటున్నారు నిపుణులు. ఓట్స్ లో అధిక ఫైబర్, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు ఉంటాయి. ఇవి శక్తిని నెమ్మదిగా రిలీజ్ చేస్తాయి. కాబట్టి పిల్లలు రోజంతా చురుగ్గా ఉంటారు. అందుకే.. వీటిని బ్రేక్‌ఫాస్ట్‌గా ఇస్తే మంచిదని చెబుతున్నారు. అంతేకాకుండా ఇవి ఏకాగ్రతను ప్రభావితం చేస్తాయి. తద్వారా పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఉంటారు.

ఇక.. ఆకుకూరలు కూడా పిల్లలకు ఇవ్వటం ద్వారా ఇవి ఆరోగ్యకరమైన నాడీ వ్యవస్థను నిర్వహి స్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి, పిల్లలు రోజంతా చురుగ్గా ఉండడంలో సహాయం చేస్తాయి. అదే విధంగా ఫింగర్ మిల్లెట్, బజ్రా వంటి మిల్లెట్స్ కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. ఎగ్జామ్ టైంలో పిల్లలకు బెస్ట్ ఫుడ్‌గా వీటిని చెప్పుకోవచ్చు. ఈ తృణధాన్యాలు అధిక ఫైబర్‌తో నిండి ఉంటాయి. కాబట్టి వీటిని వివిధ వంటకాల్లో ఉపయోగించవచ్చు. ఇవి పిల్లలు చదువుపై దృష్టి పెట్టేలా ఏకాగ్రతను ప్రోత్సాహిస్తాయి. మిల్లెట్స్ పిల్లల జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో పాటుగా చిక్పీస్, నల్లని శనగలు, మొలక లు శరీరానికి శక్తిని అందించడంతో పాటు.. రోజంతా యాక్టివ్ గా ఉండేలా చేస్తాయి. నారింజ, ద్రాక్షపండు వంటివి విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లతో పుష్కలంగా నిండి ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి. అంతే కాకుండా స్వీట్ క్రేవింగ్స్ తగ్గిస్తాయి. కాబట్టి ఎగ్జామ్స్ సమయంలో ఈ ఆహారాలను పిల్లలకు అందించడం మంచిది.












Click it and Unblock the Notifications