ఆంధ్రా స్టైల్ పుదీనా టమాటా పల్లీల పచ్చడి., అన్నం లోనే కాదు టిఫిన్స్ కు సూపర్

మనం తినే ఆహారంలో కూరల పాత్ర చాలా ఉంటుందని అందరికీ తెలిసిందే. అయితే మనం తీసుకునే ఆహారంలో పచ్చళ్ళ పాత్ర కూడా చాలా ఉంటుంది. ముఖ్యంగా రోటి పచ్చళ్ళు మనకు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఈరోజు మనం ఆంధ్ర స్టైల్ పుదీనా టమాటా పల్లీల పచ్చడి ఏవిధంగా తయారు చేయాలో తెలుసుకుందాం.

పుదీనా పచ్చడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు

పుదీనా- రెండు కట్టలు

టమాటాలు- 4

పచ్చిమిరపకాయలు- 15 నుండి 20

పల్లీలు- అరకప్పు

వెల్లుల్లి- 8 రెబ్బలు

చింతపండు- చిన్న నిమ్మకాయంత

జీలకర్ర- ఒక టేబుల్ స్పూన్

ఉప్పు- వన్ అండ్ హాఫ్ స్పూన్ (తగినంత)

నూనె - రెండు టేబుల్ స్పూన్లు

పోపు గింజలు - ఒక స్పూన్

ఎండుమిర్చి- రెండు

కరివేపాకు- రెండు రెమ్మలు

Pudina Tomato Palli Pachadi andhra Style Chutney For Idli Dosa and rice

తయారీ విధానం

ముందుగా పాన్లో కొద్దిగా నూనె వేసుకుని పల్లీలను బంగారు రంగు వరకు వేయించుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా తెంపుకొని కడుక్కున్న పుదీనా ఆకులను పాన్లో కొద్దిగా నూనెవేసి ఆకులను వేసి మగ్గించుకోవాలి. తర్వాత పుదీనా ఆకులను కూడా తీసి టమాటాలు, కొద్దిగా చింతపండు, పచ్చిమిరపకాయలు వేసి బాగా మగ్గించుకోవాలి. టమాటా గుజ్జుగా మారి, పచ్చిమిరపకాయలు వేగాయి అని నిర్ధారించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి.

ఇలా చేస్తే సూపర్ టేస్ట్

ఆ తర్వాత మిక్సీలో ఈ మొత్తం మిశ్రమాన్ని, పల్లీలతో కలిపి వేసి గ్రైండ్ చేయాలి. పల్లీలు పూర్తిగా మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అందులో వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు వేసి మరోమారు గ్రైండ్ చేసుకోవాలి. ఈ మొత్తం గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని స్టవ్ పైన ఒక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి ఎండు మిరపకాయలు, పోపుగింజలు వేసి వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసి ఈ మిశ్రమాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. అంతే రుచికరమైన పుదీనా పచ్చడి రెడీ అయినట్టే. దీనిని ఇడ్లీ దోసెలతో కానీ, వేడివేడి అన్నంతో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+