పుదీనా టమాటా రోటి పచ్చడి.. పల్లీలు కూడా కలిపి చేస్తే అద్భుతః!
పుదీనా టమాటా రోటి పచ్చడి. ఇది తినటానికి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా, రుచిగా ఉండే ఈ పచ్చడితో మన నోటికి మంచి రుచి తెలియటం మాత్రమే కాక, ఆరోగ్యానికి, ముఖ్యంగా ఆహారం జీర్ణం కావటానికి దోహదం చేస్తుంది. పల్లీలతో కలిపి చేసే పుదీనా టమాటా పచ్చడి అన్నమే కాదు చపాతీతో కలిపి తింటే చాలా బాగుంటుంది. తాజా పుదీనా ఆకులు, పండిన టమాటాలు వాడితే రుచి మరింత పెరుగుతుంది.
కావాల్సిన పదార్థాలు:
పుదీనా ఆకులు: 2 కట్టలు తెంపుకున్నవి,
టమాటాలు: మూడు (మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసినవి)
పచ్చిమిర్చి: 10,
ఉప్పు : రుచికి తగ్గట్టు,
నూనె: మూడు స్పూన్లు,
వెల్లుల్లి: 6 రెబ్బలు
కరివేపాకు: 2 రెమ్మలు
జీలకర్ర: 1/2 స్పూన్
పల్లీలు : 50గ్రాములు
చింతపండు : కొద్దిగా
పోపు గింజలు : ఒక స్పూన్
ఎండు మిర్చి : 2

తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన పాన్ పెట్టి అందులో నూనె వేసి పల్లీలు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత టమాటాలు, పచ్చి మిరపకాయలు వేసి బాగా మగ్గిన తర్వాత అవి కూడా తీసి వేరే ప్లేట్ లో పెట్టుకోండి. అదే పాన్ లో తెంచి పెట్టుకున్న పుదీనా ఆకులు, కొద్దిగా చింతపండు వేసి వేయించండి. తర్వాత వీటిని చల్లారనిచ్చి రోట్లో ఒకదాని తర్వాత ఒకటి వేసి మెత్తగా నూరుకోవచ్చు. లేదా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు.
ఇలా చేసి తింటే అద్భుతః
మొదట పల్లీలను, పుదీనా, పచ్చిమిర్చి వేసి నూరుకున్న తర్వాత, అందులో టమాటాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, తగినంత ఉప్పు వేసి నూరుకోవాలి. మెత్తగా పచ్చడిగా నూరుకున్న తర్వాత స్టవ్ పైన మళ్ళీ పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి పోపు గింజలు, ఎందు మిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి చిటపటలాడించి ఈ పోపును పచ్చడిలో కలుపుకుంటే రుచికరమైన పుదీనా టమాటా పచ్చడి సిద్ధం. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే సూపర్ టేస్టీ గా ఉంటుంది.













Click it and Unblock the Notifications
