ముల్లంగి.. మీ ఆరోగ్యానికి దిక్సూచి

ఆధునిక జీవనశైలి, బిజీ దినచర్యలు, ప్రాసెస్ చేసిన ఆహారం, ఒత్తిడి వంటివాటితో ఫ్యాటీ లివర్ సమస్య విస్తృతమవుతోంది. చాలా మందికి సాధారణ పరీక్షల వరకు కాలేయ సమస్య తెలియడం లేదు. వైద్య సహాయంతో పాటు, రోజువారీ ఆహారంలో చేసే తేలికపాటి మార్పులు కాలేయ ఆరోగ్యం మెరుగుపడటానికి సహాయపడతాయి. అటువంటి ఆహారాలలో ముల్లంగి ఒకటి. దీన్ని కాలేయానికి సూపర్‌ హీరోగా అభివర్ణిస్తుంటారు నిపుణులు.

కాలేయం నుండి విష పదార్థాలను బయటకు పంపడానికి, ఆరోగ్యంగా ఉంచడానికీ ముల్లంగి తోడ్పడుతుంది. డిటాక్సిఫై చేయగలుగుతుంది. ఇందులో ఉండే గ్లూకోసినోలేట్, ఐసోథియోసైనేట్ (isothiocyanate) వంటి సమ్మేళనాలు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి, ఇవి కాలేయ పనితీరు మెరుగుపర్చుతాయి. రోజువారీ ఒత్తిడిని ఎదుర్కొంటోన్న వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ముల్లంగిలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నుండి కలిగే నష్టాన్ని ఎదుర్కొని, కాలేయ వాపును నిరోధిస్తాయి.

ముల్లంగి పైత్యాన్ని తగ్గించగలదు. అలాగే కొవ్వును సమర్థవంతంగా జీర్ణం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఇందులో ఉండే గ్లూకోసినోలేట్లు శరీర వాపును తగ్గించడంలో సహాయపడతాయి, ఫ్యాటీ లివర్ సమస్యలను తీవ్రతరం చేసే కారకాలతో పోరాడతాయి. దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అధిక బరువును సైతం నివారించుకోవచ్చు. ఉదయం ముల్లంగి నీరు లేదా ఖాళీ కడుపుతో రసం తీసుకోవడం, సలాడ్‌లలో పచ్చి ముల్లంగిని మిక్స్ చేయడం, భోజనంలో ఓ భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థాలను నిర్మూలించినట్టవుతుంది.

ముల్లంగిలో అధిక పోషకాలు ఉండటం వల్ల దీనికి యాంటీడయాబెటిక్, యాంటీక్యాన్సర్ వంటి నిర్దుష్ట ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువగా ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్ల లభ్యతకు ఇది ప్రధాన వనరు. దీనిని మితంగా తీసుకోవడం ముఖ్యం. అధిక వినియోగం కొన్ని దుష్ప్రభావాలకు దారితీయవచ్చు. గర్భిణులు పచ్చి ముల్లంగిని తీసుకోకుండా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

ముల్లంగి రక్తంలో చక్కెర సమతుల్యత,, శక్తి జీవక్రియను మెరుగుపరచడం, ప్రేగులలో గ్లూకోజ్ శోషణను తగ్గించడంలో సహాయపడుతుంది. ముల్లంగి విత్తనాలలో లభించే సల్ఫోరాఫేన్ అనే మొక్కల సమ్మేళనం రొమ్ము క్యాన్సర్ కణాలను నిర్మూలించగలదు. రక్తపోటును కూడా ఇది నియంత్రించగలదు. గుండె జబ్బులకు అధిక రక్తపోటు ఒక ప్రధాన ప్రమాద కారకం. ముల్లంగి ఆకులు గుండె ఆరోగ్యానికి మరింత ప్రయోజనాన్ని కలిగిస్తాయి.

ముల్లంగిలో నీరు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 1/2 కప్పు (58 గ్రాములు) తరిగిన, పచ్చి ముల్లంగిలో 9.28 కిలో కేలరీలు, కొవ్వు: 0.058 గ్రాములు, సోడియం: 22.6 మిల్లీ గ్రాములు, కార్బోహైడ్రేట్లు 1.97 గ్రాములు, ఫైబర్ 0.928 గ్రాములు, చక్కెర 1.08 గ్రాములు, ప్రోటీన్: 0.394 గ్రాములు, కాల్షియం 14.4 మిల్లీ గ్రాములు, మెగ్నీషియం: 5.8 మిల్లీ గ్రాములు, ఐరన్: 0.197 మి.గ్రా విటమిన్ సీ: 8.58 మి. గ్రా, ఫాస్ఫరస్: 11.6 మి.గ్రా, పొటాషియం: 135 మిల్లీ గ్రాములు ఉంటాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+