మీలో ఈ లక్షణాలు ఉన్నాయా - లివర్ డేంజర్ లో ఉన్నట్లే, వెంటనే..!!

శీరరంలోని అవయవాల్లో కాలేయం ముఖ్యమైనది. మనం తీసుకునే ఆహారం నుంచి శరీరానికి కావాల్సిన శక్తిని అందించే అవయవం. గుండె, కిడ్నీల గురించి అనేక జాగ్రత్తలు తీసుకునే వారు సైతం అంతగా కాలేయం గురించి శ్రద్ద పెట్టరు. శరీరంలోని విష పదార్ధాలను శుభ్రపరచటం తో పాటుగా రక్తాన్ని నియంత్రించటం.. జీర్ణక్రియను సక్రమంగా నిర్వహించటం కాలేయం చేసే ముఖ్యమైన పని. కాలేయం లో సమస్యలు వచ్చినప్పుడు కొన్ని లక్షణాలు బయట పడతాయి. ఈ సమయంలోనే అలర్ట్ అయి వైద్యుడిని సంప్రదించాలి. నిర్లక్ష్యంగా చేస్తే ప్రమాదం కొని తెచ్చుకోవ టమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కాలేయం ఎంత ఆరోగ్యంగా ఉంటే మనం అంత యాక్టివ్ గా ఉంటాం. మనం తీసుకునే కొన్ని ఘన, ద్రవ పదార్ధాలు కాలేయం పని తీరును ప్రభావితం చేస్తాయి. అందులో ప్రధానంగా ఆల్కాహాల్ , ప్రాసెస్ చేసిన చెక్కర పదార్ధాలు.. వినియోగించే కొన్ని రకాల మందులు కాలేయాన్ని దెబ్బ తీసే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, కొన్ని లక్షణాలతో కాలేయం సమస్యను తొలి దశలోనే గుర్తించే అవకాశం ఉంది. తరచూ కడుపు నొప్పి, కాళ్ల వాపు కనిపించటం.. మలం - మాత్రం రంగుల్లో మార్పులు.. కళ్లు పసుపు రంగులోకి మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. కాలేయ పని తీరు తగ్గినప్పుడు ముందుగా చర్మం... కళ్లు పసుపు రంగులోకి మారుతాయి. మూత్రం ముదురు రంగులోకి వస్తుంది.

recognising-early-signs-of-liver-damage-whats-the-experts-suggets

ఆ సమయంలో బిలిరుబిన్ అనేది కాలేయం ద్వారా సరిగ్గా ప్రాసెస్ చేసే శక్తి కోల్పోతుంది. ఫలితం గా ఇది రక్తంలో అలాగే పేరుకుపోవటం వలన సమస్యలు వస్తాయి. కాలేయం బలహీన పడిన సమయంలో సమతుల్య ఆహార పదార్థాలు తీసుకున్నా కూడా ఎక్కువగా అలసట కనిపిస్తుంది. రక్తంలో బిలిరుబిన్ అధిక స్థాయిలో ఉండటం వల్ల ఎలాంటి శ్రమ లేకపోయినా.. అలసట సహజంగా వస్తూ ఉంటుంది. పొత్తి కడుపులో కుడివైపు పైభాగం తరచుగా నొప్పిగా ఉంటే ఆ సంకేతాలతో అప్రమత్తం కావాలని వైద్యులు సూచిస్తున్నారు. కాలేయం దెబ్బ తినటం ద్వారా పొత్తి కడుపులో మంట.. కదిలినప్పుడు.. శ్వాస తీసుకునే సమయంలో కడపు నొప్పి వంటి లక్షణాలు ఉంటాయనేది వైద్యుల విశ్లేషణ. ఇక, అతి మద్యం తీసుకోవటం ద్వారా ఎక్కువగా సమస్యలు ఉంటాయి. అదే విధంగా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ వంటి సమస్యలు కనిపిస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించటం ద్వారా మరింత నష్టం జరగకుండా తొలి దశలోనే నివారణ చేయవచ్చని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+