సూపర్ టేస్టీ 'సాంబార్ రైస్'.. ఇలా చేస్తే గిన్నె మొత్తం ఊడ్చేస్తారు..!
సాంబార్ అంటే చాలా మందికి నోరూరుతుంది. ముఖ్యంగా వేసవి కాలంలో సాంబార్ ను తినేందుకు ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. సాంబార్ రైస్ బయట రెస్టారెంట్స్ లో వివాహాది శుభకార్యాలయాల్లో చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అదే టేస్ట్ తో ఇంట్లోనే ఈజీగా సాంబార్ రైస్ ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఇక్కడ చూద్దాం..
సాంబార్ రైస్ కు కావాల్సిన పదార్థాలు చూస్తే బియ్యం ఒక కప్పు, కందిపప్పు అర కప్పు, సాంబార్ పొడి రెండు టేబుల్ స్పూన్ లు, ఉల్లిపాయలు రెండు, టమాటోలు రెండు, క్యారెట్ ఒక ముక్క, ములక్కాయ రెండు ముక్కలు, చింతపండు రసం అర కప్పు, పోపు గింజలు ఒక టేబుల్ స్పూన్, నూనె పావు కప్పు, కరివేపాకు రెండు రెబ్బలు, కొత్తిమీర తగినంత తీసుకోవాలి.
ఇప్పుడు సాంబార్ రైస్ తయారీ విధానం చూస్తే ముందుగా బియ్యం, కందిపప్పును శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలో నీళ్లు పోసి అందులో నానబెట్టిన బియ్యం, కందిపప్పు వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత పోపు గింజలు, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో టమాటోలు, క్యారెట్, ములక్కాయ ముక్కలు, సాంబార్ పొడి, ఉప్పు, చింతపండు రసం వేసుకుని బాగా ఉడికించుకోవాలి.

ఆ తర్వాత ఉడికిన సాంబార్ మిశ్రమాన్ని అన్నం- పప్పుతో కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. ఇప్పుడు చివరగా నెయ్యి వేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవడమే.. అంతే సూపర్ టేస్టీ సాంబార్ రైస్ రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications