ఈ నట్స్ రోజు తింటే, ఇక డాక్టర్ తో పనిలేదు.. ఇలా తీసుకోండి..!!

కరోనా తరువాత చాలా మంది జీవనశైలిలో మార్పు వచ్చింది. పౌష్టికాహారాల‌ను తింటేనే మ‌నం ఆరోగ్యంగా ఉంటాం. ప‌లు ర‌కాల విత్త‌నాల ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. కాగా, మ‌న‌కు తినేందుకు అనేక ర‌కాల విత్త‌నాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని రోజువారి ఆహారంలో భాగం చేసుకుంటే అనేక లాభాలు క‌లుగుతాయి. విత్త‌నాల‌ను తిన‌డం వ‌ల్ల అనేక ర‌కాల విట‌మిన్లు, మిన‌ర‌ల్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు, కొవ్వులు ల‌భిస్తాయి. ఇవి ఏ మోతాదులో తినాలి... ఎలా తీసుకోవాలనేది ప్రముఖ వైద్యులు సూచిస్తున్నారు

విత్తనాలల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఇది మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంది. క‌నుక విత్త‌నాల‌ను మ‌నం రోజూ తినాల‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు. మనకు అందుబాటులో ఉండే అవిస గింజెల్లో ఫైబ‌ర్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పాలిఫినాల్స్ అధికంగా ఉంటాయి. రోజూ గుప్పెడు అవిసె గింజ‌ల‌ను నీటిలో నాన‌బెట్టి తింటుండాలి. దీంతో ఎంతో మేలు జ‌రుగుతుంది. అవిసె గింజ‌ల‌ను తింటుంటే బీపీని త‌గ్గించుకోవ‌చ్చు. కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్ రాకుండా నివారించ‌వ‌చ్చు. అలాగే చియా సీడ్స్ కూడా మ‌న‌కు ఎంతో మేలు చేస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల కూడా ఫైబ‌ర్‌, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు, పాలిఫినాల్స్ ల‌భిస్తాయి. చియా విత్త‌నాల‌ను తింటుంటే రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. సీజ‌న‌ల్ వ్యాధులు త‌గ్గుతాయి. శ‌రీరంలోని వాపులు, నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. డ‌యాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవ‌చ్చు.

seeds-provide-nutrients-are-a-source-of-healthy-fats-and-can-help-reduce-cancer-risk-and-lower-cho

అదే విధంగా నువ్వులు కూడా ఎంతో మేలు చేస్తాయి. వీటిల్లో ఫైబ‌ర్‌, మెగ్నిషియం, మాంగ‌నీస్‌, కాప‌ర్‌, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ప్రోటీన్లు, మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్‌లు పుష్క‌లంగా ఉంటాయి. నువ్వుల‌ను తింటే క్యాల్షియం స‌మృద్ధిగా ల‌భించి ఎముక‌లు దృఢంగా మారి ఆరోగ్ యంగా ఉంటాయి. మ‌హిళ‌ల్లో హార్మోన్ల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. కాగా, పొద్దు తిరుగుడు విత్త‌నాల‌ను కూడా రోజూ తిన‌వ‌చ్చు. ఈ విత్త‌నాల‌ను తింటుంటే విట‌మిన్ ఇ అధికంగా ల‌భిస్తుంది. క్యాన్స‌ర్ రాకుండా అడ్ డుకోవ‌చ్చు. కొలెస్ట్రాల్‌, బీపీ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. రోజూ గుమ్మ‌డికాయ విత్త‌నాల‌ను తింటున్నా ఎంతో మేలు జ‌రుగుతుంది. వీటిల్లో అనేక ర‌కాల మిన‌ర‌ల్స్ ఉంటాయి. గుమ్మ‌డికాయ విత్త‌నాల్లో అధికంగా ఉండే మెగ్నిషియం వ‌ల్ల ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. డ‌యాబెటిస్ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. నిద్ర‌లేమి త‌గ్గుతుంది. ఈ విత్త‌నాల్లో జింక్ అధికంగా ఉంటుంది క‌నుక రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ ప‌టిష్టంగా మారుతుంది. ఇలా.. పలు రకాల విత్త‌నాల‌తో అనేక ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+