మద్యం తాగుతూ దమ్ము కొడుతున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!!

మద్యపానం.. ధూమపానం రెండూ హాని కరం. ఈ రెండింటిని కలిపితే మహా డేంజర్. కొత్త ఆరోగ్య సమస్యలు రావటం ఖాయం. గుండె జ‌బ్బులు, జీర్ణ స‌మ‌స్య‌లు, క్యాన్స‌ర్ వంటి తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. కొంత‌మంది అప్పుడ‌ప్పుడు తాగే మ‌ద్యం, ధూమ‌పానం వ‌ల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని క‌ల‌గ‌దు అని భావిస్తారు. కానీ ఈ రెండింటిని క‌లిపి ఒకే స‌మ‌యంలో చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి రెట్టింపు న‌ష్టం తప్పదని నిపుణులు హెచచరిస్తున్నారు. అసలు, ఈ రెండు కలిపి తీసుకోవం వలన ఏం జరుగుతుందో వివరిస్తున్నారు. ఇలా చేయవద్దని హెచ్చరికలు చేస్తున్నారు.

చాలా మంది మద్యపానం సమయంలోనే ధూమపానం చేస్తూ ఉంటారు. దీని కారణంగా పైకి కనిపించని నష్టాలు ఎన్నో ఉన్నాయి. శ‌రీరం పన ఒత్తిడి పెరుగుతుంది. శ‌రీర డీహైడ్రేష‌న్‌కు దారి తీస్తుంది, స‌రైన నిర్ణ‌యాలు తీసుకునే స్థామ‌ర్యం త‌గ్గేలా చేస్తుంది. ధూమ‌పానం వ‌ల్ల ఏక‌కాలంలో శ్వాస‌కోశ వ్య‌వ‌స్థ‌పై దాడి జ‌రుగుతుంది. శ్వాస తీసుకోవ‌డం కష్టంగా మారుతుంది. ఇక ఈ రెండు క‌లిసిన‌ప్పుడు జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు అసౌక‌ర్యం, గ్యాస్, ఉబ్బ‌రం, అజీర్ణం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తు తాయి.

smoking-and-drinking-together-dramatically-raises-your-risk-of-developing-cancers-in-the-aerodigesti

స‌మ‌న్వ‌య లోపం వంటి త‌క్ష‌ణ ప్ర‌భావాల‌ను కూడా అనుభ‌విస్తారు. ధూమ‌పానం, మ‌ద్య‌ పానం విడివిడిగా శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌య‌వాల‌ను దెబ్బ‌తీస్తాయి. ఇలాంటి రెండు కలిపి తీసుకోవటం వలన ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. ధూమ‌పానం ఊపిరితిత్తుల‌ను దెబ్బ‌తీస్తే, మ‌ద్య‌పానం కాలేయ ఆరోగ్యాన్ని దెబ్బ‌తీస్తుంది. ఇవి రెండు క‌లిసి గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తాయి. శ‌రీరంలో అవ‌య‌వాల‌న్నీ ఇబ్బందుల‌కు గురి అవుతాయి.

ఆరోగ్యానికి ప్రమాదం

ఈ రెండు కలవటం వలన ఒకే సారి ర‌క్త‌పోటు పెరిగి గుండెపై అధిక ఒత్తిడి ప‌డుతుంది. కాల ‌క్ర‌మేణా ఇది శ‌రీర రోగ‌నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను దెబ్బ‌తీస్తుంది. త‌ర‌చూ ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. పున‌రుత్ప‌త్తి ఆరోగ్యం దెబ్బ‌తింటుంది. సంతానోత్ప‌త్తి త‌గ్గ‌డంతోపాటు లైంగిక సామ‌ర్థ్యం త‌గ్గుతుంద‌ని వైద్యులు చెబుతున్నారు. ధూమ‌పానం, మ‌ద్య‌పానం క‌లిపి చేయ‌డం వ‌ల్ల ఊపిరితిత్తులు, కాలేయం, గొంతు, రొమ్ము క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది.

దీర్ఘ‌కాలిక మ‌ద్య‌పానం వ‌ల్ల కాలేయ సిర్రోసిస్ వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. దీర్ఘ‌కాలిక ధూమ‌పానం వ‌ల్ల బ్రోన్కైటిస్, ఎంఫిసెమా, గుండె జ‌బ్బులు, స్ట్రోక్ వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. యువ‌కులు, మ‌ధుమేహం ఉన్న వారు, శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి ఇవి మ‌రింత హానిని క‌లిగిస్తాయి. యువ‌కులు చిన్న వ‌య‌సులోనే వీటిని అల‌వాటు చేసుకోవ‌డం వ‌ల్ల వ్య‌స‌నంగా మార‌డంతో పాటు తీవ్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి వ‌స్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+