ఖాళీ కడుపుతో కొన్ని బాదం పప్పులను నమలండి చాలు.. !!

బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలం. చాలామంది వీటిని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తింటారు. ఇలా చేయడం వల్ల బాదం ప్రయోజనాలు పెరుగుతాయి. తేలిగ్గా జీర్ణం అవుతాయి. నానబెట్టడం వల్ల అందులోని ప్రొటీన్లు సులభంగా శరీరానికి అందుతుంది. నానబెట్టిన బాదం నిజంగా అధిక ప్రయోజనాలనిస్తుందా లేక ఇది కేవలం అపోహ మాత్రమేనా? దీనిపై స్పష్టత పొందే ముందు, నానబెట్టిన బాదంపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిద్దాం.

నానబెట్టిన బాదంలో రైబోఫ్లేవిన్, ఎల్-కార్నిటిన్ ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు తోడ్పడతాయి. వృద్ధాప్యంలో జ్ఞాపకశక్తి మందగించకుండా రక్షించి, మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. నానబెట్టిన బాదం సులభంగా నమలవచ్చు. వీటిని తీసుకుంటే ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. అలాగే ఆకలిని నియంత్రిస్తుంది. ఇది బరువును తగ్గించడంలో, అదుపులో ఉంచడంలో సమర్థవంతంగా సహాయపడుతుంది.

మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వులతో నిండిన నానబెట్టిన బాదం గుండె ఆరోగ్యానికి ఉత్తమం. ఇవి LDL (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గించి, HDL (మంచి కొలెస్ట్రాల్)ను పెంచడంలో దోహదపడతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్న నానబెట్టిన బాదం చర్మాన్ని సూర్యరశ్మి, ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తాయి. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది.

నానబెట్టిన బాదం ఆరోగ్యకరమైనవే అయినా, నీటిలో నానబెట్టడం వలన నీటిలో కరిగే విటమిన్లు బీ, సీ కొంతవరకు తగ్గే అవకాశం ఉంది. అంతేకాకుండా, వాటి స్వాభావిక రుచి, కరకరలాడే స్వభావం కూడా కొద్దిగా మారవచ్చు. మొత్తం మీద, నానబెట్టిన బాదం ఆరోగ్యానికి ప్రయోజనకరమే. అయితే, వీటిని మీ ఆహారంలో చేర్చుకోవాలా వద్దా అనేది మీ వ్యక్తిగత ప్రాధాన్యత, శరీర అవసరాలపై ఆధారపడి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+