అంజీర్ పండ్ల‌ను తింటే అద్భుత‌మైన ప్ర‌యోజ‌నాలు..!!

అంజీర్. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తోంది. అంజీర్ పండ్ల‌తోపాటు ఇవి డ్రై ఫ్రూట్స్ రూపంలోనూ అందుబాటులో ఉంటాయి. అంజీర్ పండ్లు మ‌న‌కు కేవ‌లం సీజ‌న్‌లోనే ల‌భిస్తాయి. కానీ డ్రై ఫ్రూట్స్ మాత్రం ఎప్పడూ లభ్యం అవుతాయి. అంజీర్ పండ్ల‌ను తిన‌డం వల్ల అనేక పోష‌కాలు ల‌భిస్తాయి. రాత్రి పూట 3 అంజీర్ పండ్ల‌ను నీటిలో నాన‌బెట్టి వాటిని మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా తింటే ఎంతో మేలు జ‌రుగుతుంది. అంజీర్ తో జీర్ణ వ్యవస్థ తో పాటుగా శరీరంలో అనేక భాగాలకు ప్రయోజనం కలుగుతుంది.

డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ కు ప్రత్యేక స్థానం ఉంది. వీటిల్లో ఫైబర్ స‌మృద్ధిగా ఉంటుంది. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను తింటే మ‌ల‌బ‌ద్ద‌కం సమస్య ఉండదు. వీటి ద్వారా జీర్ణ వ్య‌వ‌స్థ‌లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీంతో మ‌నం తినే ఆహారంలో ఉండే పోష‌కాల‌ను శ‌రీరం స‌రిగ్గా శోషించుకుంటుంది. దీని వ‌ల్ల పోష‌కాహార లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. గ్యాస్‌, అసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి జీర్ణ స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంజీర్ పండ్ల‌లో స‌హ‌జ‌సిద్ధ‌మైన చ‌క్కెర‌లు ఉంటాయి. గ్లూకోజ్‌, ఫ్ర‌క్టోజ్‌ల‌తోపాటు పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల ఈ పండ్ల‌ను ఉద‌యం తింటే శ‌రీరానికి రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. అంజీర్ పండ్ల‌లో క్యాల్షియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్ అధికంగా ఉంటాయి. ఇవి ఎముక‌ల సాంద్ర‌త‌ను పెంచి ఎముక‌లు ప‌టిష్టంగా మారేలా చేస్తాయి. అంజీర్ పండ్ల‌ను నాన‌బెట్ట‌డం వ‌ల్ల ఈ పోష‌కాల శాతం మ‌రింత పెరుగుతుంది.

soaked-anjeer-is-high-in-dietary-fiber-which-promotes-digestive-health

అంజీర్ తీసుకోవటం వలన ఎముక‌లు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా మెనోపాజ్ దాటిన మ‌హిళ‌ల‌కు ఈ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. వెన్నెముక స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. వీటిని తింటే శ‌రీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొల‌గిపోతాయి. బీపీ త‌గ్గుతుంది. హైబీపీ నియంత్ర‌ణ‌లో ఉంటుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అధికంగా బ‌రువు ఉన్న‌వారు ఈ పండ్ల‌ను తింటుంటే బ‌రువు త‌గ్గ‌డం చాలా తేలిక‌వుతుంది. షుగ‌ర్ ఉన్న‌వారు సైతం ఈ పండ్ల‌ను నిర్భ‌యంగా తిన‌వ‌చ్చు. పైగా ఈ పండ్ల‌లో ఉండే ఫైబ‌ర్‌, యాంటీ ఆక్సిడెంట్లు షుగ‌ర్ లెవ‌ల్స్‌ను త‌గ్గించేందుకు దోహ‌దం చేస్తాయి.

అంజీర్ పండ్ల‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పాలిఫినాల్స్‌, ఫ్లేవ‌నాయిడ్స్‌, కెరోటినాయిడ్స్ ఉంటాయి. దీంతో శ‌రీరంలో అంత‌ర్గ‌తంగా వ‌చ్చే వాపులు త‌గ్గిపోతాయి. ఫ‌లితంగా క్యాన్స‌ర్‌, గుండె పోటు వంటి ప్రాణాంత‌క వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. రోజూ రాత్రి 3 అంజీర్ పండ్ల‌ను నీటిలో నాన‌బెట్టి వాటిని మ‌రుస‌టి రోజు ఉద‌యం తింటుంటే ఎంత‌గానో ప్ర‌యోజ‌నం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+