ఈ ఒక్కటి ప్రతిరోజూ తీసుకోండి.. మీ డయాబెటిస్ కంట్రోల్ లో ఉంచుకోండి!
బార్లీ... ధాన్యాలలో ఇది ఒకటి. బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది . దీనిని ఆహారంగా మాత్రమే కాదు బీర్ల తయారీలోనూ, పశుగ్రాసంగాను ఉపయోగిస్తారు. బార్లీ మానవ శరీరానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా సమశీతోష్ణ వాతావరణంలో పండించే ఒక ప్రధాన ధాన్యపురకం బార్లీ . దీనికి చాలా పెద్ద చరిత్ర ఉంది. యురేషియాలో పదివేల సంవత్సరాల క్రితమే దీన్ని పండించారు. మానవుడు తొలినాళ్ళల్లో సాగుచేసిన ధాన్యాలలో బార్లీ ఒకటి.
బార్లీతో ఈ అనారోగ్య సమస్యలకు చెక్
బార్లీని వివిధ రకాల వంటకాలలో, ముఖ్యంగా బార్లీ నీళ్లతో గంజి, అన్నం వంటివి తయారు చేయడానికి ఉపయోగిస్తారు. బీర్, బార్లీ కాఫీ వంటివి తయారు చేయడానికి కూడా ఉపయోగిస్తారు. బార్లీలో ఎక్కువగా ఫైబర్ ఉండటం వల్ల ఇది రక్తంలో అధికంగా ఉన్న కొలెస్ట్రాల్ ను, చక్కెర స్థాయిలను తగ్గించి జీవక్రియను మెరుగుపరుస్తుంది. డయాబెటిస్ నిర్వహణలో బార్లీ చాలా ప్రముఖ స్థానం పోషిస్తుంది.

బార్లీతో ఇన్సులిన్ సున్నితత్వం మెరుగు
బార్లీలో బీటా-గ్లూకాన్ సమృద్ధిగా ఉంటుంది, ఇది గ్లూకోజ్ శోషణను నెమ్మదిగా చేసే ఒక రకమైన ద్రావణీయ ఫైబర్. ఇది స్థిరమైన రక్త చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. మన శరీరంలో బ్లడ్ షుగర్ ను గణనీయంగా నియంత్రిస్తుంది. క్రమం తప్పకుండా బార్లీ ని ఉపయోగించడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచవచ్చు.
బార్లీ డయాబెటిస్ నిర్వహణపై అధ్యయనం
ఇది డయాబెటిస్ నిర్వహణకు చాలా కీలకంగా ఉంటుందని భావిస్తున్న క్రమంలో దీనిపైన పరిశోధకులు అధ్యయనం చేస్తున్నారు. ప్రస్తుతం పెరుగుతున్న డయాబెటిస్ కేసులతో మళ్లీ బార్లీ గింజలకు ప్రజాదరణ పెరుగుతోంది. చాలామంది దాని ఆరోగ్య ప్రయోజనాలను గురించి తెలుసుకుని దానిని నిత్యం ఆహారంలో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
బార్లీతో బరువుకు చెక్.. ఇంకా ప్రయోజనాలు ఇవే
బార్లీ గింజల యొక్క ప్రయోజనాన్ని గురించి ప్రజలలో పెరుగుతున్న అవగాహన చాలామంది అది తమ ఆహారంలో భాగంగా చేసుకోవడానికి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. బార్లీ డయాబెటిస్ ను సమర్థవంతంగా నిర్వహించాలి అనుకునే వారికి ప్రధాన ఆహారంగా కూడా మారుతుంది. ఒక డయాబెటిస్ మాత్రమే కాదు బార్లీ మన శరీరానికి కావలసిన తక్షణ శక్తిని అందించి నీరసాన్ని తగ్గిస్తుంది. బార్లీ నీటితో మన శరీరానికి చలువ చేస్తుంది. బార్లీ నీళ్లను ప్రతిరోజు ఉదయం తాగడం వల్ల బరువు తగ్గడానికి కూడా ఇది దోహదం చేస్తుంది.












Click it and Unblock the Notifications