Sperm Count: ఈ పని చేయండి.. అవి భారీగా పెరుగుతాయి..!
కొన్ని పనులు చేయడం వల్ల వీర్యకణాల సంఖ్య పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుత జీవనవిధానం, తీసుకునే ఆహారం వర్ల చాలా మంది సంతాన లేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగ్గి సంతాన లేమి సమస్యలు ఏర్పడుతున్నాయి. సాధారణంగా మిల్లీలీటర్ విర్యానికి 15 మిలియన్ల కంటే ఎక్కువగా ఉండాలి. 15 విలియన్ల కంటే తక్కువగా ఉంటే వారి స్పెర్మ్ కౌంట్ తగ్గినట్లు వైద్యులు చెబుతారు. సాధారణంగా వీర్యం సాంద్రత ప్రతి మిల్లీలీటరుకు కనీసం 20 మిలియన్లు ఉండాలి.

మద్యపానం
ఆహారపు అలవాట్లు, మద్యపానం, దూమపానం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. హార్మోన్ల సమతుల్యత దెబ్బ తిని కూడా స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. వీర్యకణాలు వృద్ధి చెందాలంటే చక్కటి నిద్ర, మంచి ఆహారం, మద్యపానం, దూమపానానికి దూరంగా ఉండాలి. వీర్య కణాలు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, చేపలు తీసుకోవాలి.

పీతలు, చేపలు
పీతలు, చేపలు వంటి సముద్రపు ఆహారంతోపాటు కోళ్లు, కోడిగుడ్లు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, వెన్నతీసిన పాలు, కొవ్వు తక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు తీసుకోవడం వల్ల వీర్యకణాల నాణ్యత పెరుగుతుంది. సోయా ఉత్పత్తులు, జున్ను, మద్యం, వెన్న ఎక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు, కాఫీ, తీయగా ఉండే పానీయాలు, స్వీట్లు తినేవారిలో వీర్యకణ నాణ్యత తక్కువగా ఉంటుందట. అందుకే వీటిని తీసుకోవడం కాస్త తగ్గించాలి.

యోగా
క్రమం తప్పకుండా యోగా చేయడం వల్ల కూడా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. వృషణాలు వేడెక్కడం వల్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. బిగుతైన లోదుస్తులు ధరించడం వల్ల అవి వీర్య కణాలను పూర్తి సామర్థ్యం మేరకు ఉత్పత్తి కావని నిపుణులు చెబుతున్నారు. పడుకునే ముందు వదులైన దుస్తువులు ధరించాలని సూచిస్తున్నారు.
-
నోట్లో వేసుకోగానే కరిగిపోయేలా "క్యారెట్ హల్వా" ఎలా చేయాలంటే..? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications