బీపీ చెక్ చేసే వేళ ఇలా అస్సలు చేయద్దు - ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!
బీపీ- రక్తపోటు. ప్రస్తుత కాలంలో సర్వ సాధారణంగా మారుతున్న ఆరోగ్య సమస్య. బీపీ కారణంగా ఎన్నో ప్రాణాంతకైన ఇబ్బందులు ఉన్నాయి. బీపీ ఎప్పుడూ నియంత్రణలో ఉండటం అవసరం. బీపీ పెరిగినా.. ఉండాల్సిన దాని కంటే తగ్గినా ముప్పు తప్పదు. చాలామందికైతే బీపీ ఉందన్న విషయం కూడా తెలీదు. ప్రతి ఒక్కరూ తరచుగా బీపీ చెక్ చేయించుకోవడం మంచిది. అయితే, బీపీ చెక్ చేసే వేళ జరిగే పొరపాట్లు అసలు సమస్య గుర్తించకుండా నష్టం చేస్తాయి. దీంతో, బీపీ చెక్ చేసే వేళ.. ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు అవసరం.
రక్తపోటు పరీక్ష చేయించుకోవటమే కాదు.. పరీక్ష చేసే సమయంలో కొన్ని పొరపాట్లు అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హై బీపీ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. క్రమం తప్పకుండా పరీక్షించుకోవాలి. లేదంటే అది గుండెపోటు, పక్షవాతం లాంటి సమస్యలకు దారితీస్తుంది. బీపీ పరీక్ష ఎంత ముఖ్యమో... బీపీ రికార్డు చేసే సమయం అంతే ముఖ్యం. ప్రధానంగా.. వ్యాయామం, ఒత్తిడి, తీసుకునే ఆహారం, నీళ్లు తాగే విధానం శరీరంలో బీపీ హెచ్చు తగ్గులకు కారణం అవుతుంది. దీంతో, తోచిన సమయంలో కాకుండా వైద్యులు సూచించిన సమయం లోనే బీపీ చెక్ చేయించుకోవాలి. తొలి రక్తపోటు (బీపీ) రీడింగ్‌కు పొద్దున నిద్ర లేచిన అర్ధగంట తర్వాత సమయం సరైనదిగా పరిశోధనలు తేల్చాయి. అయితే, ఏమీ తినకూడదు. కాఫీ లాంటి ద్రవ పదార్థాలు తాగకూడదు.

అదే విధంగా రోజులో రెండోసారి బీపీ రీడింగ్ తీసుకోవడానికి నిద్రకు ముందు అనువైన సమయం గా నిర్దారించారు. కాకపోతే రాత్రి భోజనం చేసిన రెండు గంటల తర్వాత తీసుకోవాలి. ఇది రోజులో మీ బీపీ ఎలా మారిందో తెలుసుకోవడానికి. మీ గుండె, రక్త నాళాల ఆరోగ్యం ఎలా ఉందో క్లారిటీ రావటానికి ఉపకరిస్తుంది. ఇక, బీపీ మిషన్లు రకరకాలు మోడల్స్ లో అందుబాటులోకి రావటంతో ఇంటి వద్దే రీడిండ్ తీసే వారి సంఖ్య పెరిగింది. దీంతో.. ఇంటి వద్ద ఉదయం.. సాయంత్రం వేళ రెండు సార్లు బీపీ నమోదు చేస్తే ఖచ్చితత్వం వస్తుంది. ఒకేసారి రెండు రీడింగులు తీసుకోవాల నుకుంటే మొదటి దాని తర్వాత మూడు నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. ఆ తర్వాత రెండిటినీ నమోదు చేసుకోవాలి. రెండిటి మధ్య తేడా ఎక్కువగా ఉంటే మూడోది అవసరమవుతుంది. ఆ తర్వాత మూడిటి సగటు లెక్కించాలి. బీపీ మిషన్ ఒకేదానిని వాడాలి. శరీరం ఒకే భంగిమలో ఈ రీడింగ్ నమోదు చేయాలి. అయితే, బీపీ ఉన్న వారు రోజు మాత్ర వైద్యుల సూచన మేరకు వినియోగం తప్పని సరి. బీపీ విషయంలో ఏ మాత్రం సొంత వైద్యం.. నిర్లక్ష్యం సరికాదు.
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications