కొరుకుడు పడని కొరియాకు ఫైనల్ లో చుక్కలు చూపిన భారత్.. !!

జపాన్‌ ఐచి-నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ లో భారత మహిళల రికర్వ్ టీమ్ నూతన చరిత్ర సృష్టించింది. సరికొత్త రికార్డును నెలకొల్పింది. బంగారు పతకాన్ని తన ఖాతాలో వేసుకుంది. అంకిత భకత్, కీర్తి, కుంకుమ్ అనిల్ మోహోద్‌తో కూడిన మహిళా త్రయం బలమైన దక్షిణ కొరియా జట్టును ఓడించింది. భారత క్రీడా రంగంలో ఈ విజయం సువర్ణాక్షరాలతో లిఖించదగిన అద్భుత ఘట్టంగా నిలిచిపోనుంది.

ప్రపంచ వేదికలపై ముఖ్యంగా ఆర్చరీలో తిరుగులేని అగ్రరాజ్యంగా భావించే దక్షిణ కొరియా జట్టును ఓడించడం సాధారణ విషయం కాదు. అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ తుది సమరంలో భారత క్రీడాకారిణులు అసాధారణ ప్రతిభను ప్రదర్శించారు. కొరియాపై 5-3 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించి.. మన సత్తాను యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు.

India women s Archery recurve team won gold medal at the Asian Games defeating South Korea 5-3 final

ప్రపంచ వ్యాప్తంగా రికర్వ్ ఆర్చరీ అనగానే దక్షిణ కొరియా మహిళల ఆధిపత్యమే గుర్తొస్తుంది. దశాబ్దాలుగా ఒలింపిక్స్‌, ఆసియా క్రీడల వంటి పెద్ద ఈవెంట్లలో వారు ఏకపక్ష విజయాలను నమోదు చేస్తూ వస్తోన్నారు. ఐచి-నగోయాలో వారి పాచిక పారలేదు. కొరియా క్రీడాకారిణుల గేమ్‌ను సమర్థవంతంగా తిప్పికొడుతూ మ్యాచ్ ఆరంభం నుంచే భారత్ పైచేయి సాధించింది. భారత క్రీడాకారిణులు లక్ష్యాన్ని అత్యంత కచ్చితత్వంతో ఛేదిస్తూ కొరియా పతకాల ఆధిపత్యానికి ముగింపు పలికారు.

తిరుమలలో హాలిడే రష్ పీక్స్- 26 గంటలకు పైగా: క్యూ కాంప్లెక్స్, గోగర్భం సర్కిల్ వరకూ
తిరుమలలో హాలిడే రష్ పీక్స్- 26 గంటలకు పైగా: క్యూ కాంప్లెక్స్, గోగర్భం సర్కిల్ వరకూ

ఈ గేమ్ ఆరంభం నుంచీ ఉత్కంఠత నెలకొంది. మొదటి రెండు సెట్లు కూడా సమంగా ముగిశాయి. ఇరు జట్లు వరుసగా 54, 56 పాయింట్లు సాధించాయి. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ కాంగ్ చాయోంగ్, ఓయెజిన్, లీ యుంజీతో కూడిన కొరియా జట్టు.. మూడవ సెట్‌లో తడబాటు ప్రదర్శించింది. ఆ సెట్‌లో కొరియా టీమ్ 52 స్కోర్ పాయింట్లకే పరిమితమైంది. దాన్ని తనకు అనుకూలంగా మలచుకుంది భారత్. ఆ రౌండ్ లో భారత ఆర్చర్లు 55 స్కోర పాయింట్లు సాధించి.. మూడో సెట్‌ను కైవసం చేసుకున్నారు.

నాలుగో సెట్‌లో కొరియా 54 పాయింట్లతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. ఆ సెట్ లో కూడా భారత అర్చర్ల హవా తగ్గలేదు. కీర్తి ఎనిమిది పాయింట్లతో నాలుగో సెట్ ను ప్రారంభించింది. ఆ తర్వాత అదే సెట్ లో మరో స్కోరింగ్ పాయింట్ లభించడంతో ఆ సంఖ్య తొమ్మిదికి పెరిగింది. ఆ సెట్ లో మొత్తం పాయింట్లు 54కు చేరాయి. దీంతో స్కోరు సమం అయింది. ఆ సెట్ డ్రాగా ముగియడంతో భారత్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+