ముఖం మీద ముడతలు తగ్గించి, యవ్వనంగా కనిపించాలంటే ఇవి ట్రై చెయ్యండి!
వయసుతో పాటు చాలామంది ముఖం మీద ముడతలు వస్తాయి. అయితే ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు వచ్చి పెద్ద వయసు వారిలాగా చాలామంది కనిపిస్తున్నారు. ఇక ముఖం మీద ముడతలను తగ్గించి మనల్ని యవ్వనంగా ఉండేలా చేసే సహజ చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
కలబంద
ముఖం మీద ముడతలను తగ్గించడంలో అలోవెరా బాగా పనిచేస్తుంది. కలబందలో విటమిన్ సి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్ లో కొల్లాజిన్ ఉత్పత్తిని పెంచుతాయి. చర్మం హైడ్రేటెడ్ గా ఉండేలా చేస్తాయి. కలబంద జెల్ తీసుకొని ముఖం మీద అప్లై చేసి, ఐదు నిమిషాలు సున్నితంగా మసాజ్ చేసి, 20 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ముడతలు తగ్గుతాయి.

కొబ్బరి నూనె
కొబ్బరి నూనె కూడా ముఖం మీద ముడతలను తగ్గించడానికి బాగా పనిచేస్తుంది. ఇది అకాల ముడతలకు కారణమయ్యే ఆక్సికరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ప్రతిరోజు రాత్రి పూట కొద్దిగా నూనెను గోరువెచ్చగా చేసి వృత్తాకార కదలికలతో మసాజ్ చేసి రాత్రిపూట అలానే వదిలేయాలి. తెల్లవారుజామున లేచిన తర్వాత చల్లటి నీళ్లతో కడుక్కుంటే ముడతలు తగ్గుతాయి.
నిమ్మకాయ, తేనె
నిమ్మకాయ, తేనె కూడా ముఖం మీద ముడతలు తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తుంది. తేనే మన చర్మంలో తేమను నిలుపుతుంది. అంతేకాదు కొల్లాజిన్ పెంచుతుంది. ఒక టీ స్పూన్ తేనెలో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని కలిపి ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేస్తే ముఖం మీద ముడతలు తగ్గుతాయి.
గుడ్డులోని తెల్ల సొన
గుడ్డులోని తెల్లసొన కూడా ముఖం మీద ముడతలను తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది. గుడ్డులోని తెల్లసొనను ముఖానికి అప్లై చేస్తే ముఖం మీద చర్మం బాగా టైట్ అవుతుంది. దీనిని ఫేస్ కు ఒక మాస్క్ లాగా పూసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి చల్లటి నీళ్ళతో కడుక్కోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే ముఖం మీద ముడతలు తగ్గుతాయి.
ఆముదం
ఆముదం నూనెలో రిసినోలిక్ ఆమ్లం ఉంటుంది. చర్మం యొక్క ఎలాస్టిసిటీని బాగా పెంచుతుంది. ఇది మన ముఖం పైన ముడతలను నివారించడానికి దోహదం చేస్తుంది. నిద్రకు ఉపక్రమించే ముందు కొద్దిగా ఆముదం నూనెను ముఖం మీద అప్లై చేసి కొద్దిసేపు మసాజ్ చేయాలి. ఆపై తెల్లవారుజామున ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
అరటిపండు ఆలివ్ ఆయిల్ మాస్క్
అరటిపండు, ఆలివ్ ఆయిల్ మాస్క్ తో కూడా ముఖం మీద ముడతలు తగ్గుతాయి. బాగా పండిన అరటిపండును మెత్తగా చేసి కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ తో కలిపి ముఖం పైన ఈ పేస్ట్ ను అప్లై చేసి 20 నిమిషాలు అలాగే ఉంచి గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకుంటే ముఖం మీద ముడతలు తగ్గుతాయి.
-
వేసవిలో శరీరానికి చల్లదనం ఇచ్చే "వెజిటెబుల్ మజ్జిగ పులుసు" ట్రై చేస్తారా..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి












Click it and Unblock the Notifications