విటమిన్​ బి12 లోపం లక్షణాలు- జాగ్రత్తలు, నిర్లక్ష్యం చేస్తే ముప్పే..!!

ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు అవసరం. సరైన స్థాయిలో శరీరంలో విటమిన్లు ఉండాలి. ఈ మధ్య కాలంలో విటమిన్ బీ12 లోపం చాలా మందిలో గుర్తిస్తున్నారు. దీని కారణంగా అనేక సమస్యలు వస్తున్నాయి. ఆకలి మందగించడం, ఉన్నట్టుండి నీరసం రావడం, కాసేపు కూర్చుని లేవగానే కళ్లు తిరగడం లాంటివి విటమిన్​ బి12 లోపం వల్ల కనిపించే లక్షణాలు. బీ12 లోపం పెరిగితే నరాల సమస్యగా మారుతోంది. దీంతో.. లక్షణాలు కనిపిస్తే వెంటనే అవసరమైన జాగ్రత్తలు.. చికిత్స అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

శరీరంలో విటమిన్ B12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తి, డీఎన్ఏ సంశ్లేషణ, ఆరోగ్యకరమైన నరాల కణాలను నిర్వహించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సహజంగా మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తుల వంటి జంతు ఆధారిత ఆహారాలలో లభిస్తుంది. అయితే, శరీరానికి సరిపడా పోషకాలు అందని వారు ఈ విటమిన్ లోపానికి ఎక్కువగా గురవుతారని, దీంతో అలసట, జ్ఞాపకశక్తి సమస్యలు, నరాల దెబ్బతినడం, మానసిక స్థితిలో మార్పులు కనిపిస్తాయి. విటమిన్ బీ12 లోపిస్తే చేతులు, కాళ్లు, లేదా పాదాలలో జలదరించడం లేదా తిమ్మిరి వస్తాయి. కండరాలలో బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం లేదా ఏకాగ్రత లోపించడం, మానసిక స్థితిలో మార్పులు, డిప్రెషన్ లేదా చిరాకు, చేతులు, కాళ్లలో మంటలు వంటివి ఉంటాయి. నరాల చుట్టూ ఉండే రక్షణ పొర అయిన మైలిన్ ఉత్పత్తికి విటమిన్ B12 చాలా అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఈ విటమిన్ లోపం వల్ల మైలిన్ పొర క్షీణించడం మొదలవుతుంది.

vitamin-b12-deficiency-can-cause-physical-neurological-and-psychological-symptoms

ఈ సమస్య మెదడు, శరీరంలోని ఇతర భాగాల మధ్య సమాచార మార్పిడిని అడ్డుకుంటుందని, ఫలితంగా తిమ్మిరి, బలహీనత, ఆలోచనా సామర్థ్యంలో సమస్యలు వంటి లక్షణాలు ఉంటాయి. ఈ విటమిన్ లోపం వల్ల శారీరక, నాడీ, మానసిక లక్షణాలను కలిగిస్తుంది. ఈ సమస్య తీవ్రంగా ఉండే వారిలో వెన్నుపాములోని సబ్అక్యూట్ కంబైన్డ్ డిజెనరేషన్ అనే తీవ్రమైన నాడీ సమస్యకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సమస్య చికిత్స తీసుకోకుండా అలా వదిలేస్తే, తీవ్ర నష్టం జరగవచ్చని హెచ్చరిస్తున్నారు. నిరంతరంగా తిమ్మిరి, జలదరించడం, సమతుల్యత కోల్పోవడం లేదా మానసిక గందరగోళం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+