ఆ మంచినీళ్ల సీసా ఖరీదు రూ.50 లక్షలు?
మంచినీళ్లకు ఇచ్చే విలువ కూడా మనిషికి ఇవ్వడంలేదని కొందరు వాపోతుంటారు. మంచినీరు ఉచితంగా దొరుకుతుంది కాబట్టి దానికి విలువ ఉండదు అనేది కొందరి అభిప్రాయం. అయితే ప్రస్తుత రోజులు వేరు.. పాతరోజులు వేరు. అందుబాటులో ఉన్న మంచినీటిని వదిలేసి మినరల్ వాటర్ కావాలంటూ దానివెంట పడ్డారు. తాగేది మంచినీరో తెలియదు.. మినరల్ వాటరో తెలియదు. కానీ రోజూ తాగేస్తున్నాం. క్యాన్ లో వాటర్ తాగితేనే హోదా కింద లెక్క.
అక్షరాలా అంతే : మంచినీళ్ల సీసా బయట రూ.20 దొరుకుతుంది. ప్రాంతాన్ని బట్టి దాని ధర కూడా మారుతుంది. బస్ స్టేషన్, రైల్వేస్టేషన్, తియేటర్స్, మెట్రో స్టేషన్లు.. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ధర పలుకుతుంది. అయితే ఒక మంచినీళ్ల సీసా ఖరీదు రూ.లక్షల్లో ఉంటే కొంటారా? మంచినీళ్ల సీసా విలువ అన్ని లక్షలా? అని ఆశ్చర్యపోవద్దు. 750 ఎంఎల్ మంచినీళ్ల సీసా అక్షరాలా రూ.50 లక్షలుగా ఉంది.

నీటికి కాదు.. సీసాకే విలువ : నీటికి అంత విలువ లేదు. ఎందుకంటే ప్యాక్ చేసే బాటిల్ కే ఆ ధర. అక్వాడి క్రిస్టల్లో ట్రిబ్యూటో ఎ మొడిగ్లియాని అనే మంచినీళ్ల సీసా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ గా పేరు తెచ్చుకుంది. ఇది గాజు సీసా. 24 క్యారట్ల బంగారాన్ని పోత పోసి చేశారు. ఈ సీసాకు మ్యాజిక్ టచ్ ఉంటుంది. దీన్ని ప్రముఖ డిజైనర్ ఫెర్నాండో అల్టామిరానో అందించింది. ఈ సీసాలోని పరతి నీటి చుక్కలో 5 గ్రాములు 23 క్యారెట్ల బంగారం ఉంటుంది. ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ స్టేడియంలో ఈ బాటిల్ పట్టుకొని కనిపించారు. దీంతో ఆ సీసా ఎంత? ఎక్కడ దొరుకుతుంది? దాని ప్రత్యేకతలేంటి? అంబానీ కుటుంబం మోజుపడిందంటే అందులో ఉన్న స్పెషాలిటీ ఏమిటి? తదితర వివరాలను ఆరా తీస్తున్నారు.












Click it and Unblock the Notifications