పుచ్చకాయతో వీటిని తింటే యమ డేంజర్
పుచ్చకాయ తినడంవల్ల ఎంతో ఆరోగ్యమని మనకు తెలిసిందే. అయితే పుచ్చకాయతోపాటు పాల ఉత్పత్తులను తినడం మానుకోవాలి. ఎక్కువ మంది పాలతో చేసిన స్మూతీస్ ను ఇష్టపడి తింటుంటారు. కానీ దీనివల్ల అనారోగ్యమేకానీ ఆరోగ్యం కలగదు. వైద్య నిపుణులు, ఆహార నిపుణులు కూడా అలా తినడాన్ని నిరాకరిస్తున్నారు. పాలు, పుచ్చకాయ రెండూ కలిపి తీసుకోవడంవల్ల గ్యాస్, కడుపు ఉబ్బరం వస్తాయి.
అలాగే ఉప్పుతో కలిపి తినడం మానుకోవాలి. చాలామంది పుచ్చకాయ రుచిని పెంచడానికి ఉప్పుతో తింటుంటారు. కానీ దీనికి ఉప్పును పూయడంవల్ల శరీరంలో పోషకాలను గ్రహించదు. తినే అలవాటుంటే వెంటనే మానుకోవడం ఉత్తమం.

పుచ్చకాయ తిన్న తర్వాత చాలామంది ఆహార ధాన్యాలు తింటుంటారు. కానీ అలా తినకూడదు. పుచ్చకాయ తిన్న 30 నిముషాల వరకు ఆహార ధాన్యాలు తినకూడదు. ఇలా తినడంవల్ల శరీరంలోని పేగులపై ప్రభావం చాలా చెడ్డగా ఉంటుంది. అంతేకాకుండా విషపూరిత పదార్థాలు నెమ్మదిగా శరీరంలో ఏర్పడటం ప్రారంభిస్తాయి.
పుచ్చకాయతో వేయించిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుతుంది. తిన్న వెంటనే హృదయ సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
పుచ్చకాయ తిన్న వెంటనే కోడి గుడ్లను తినకూడదు. చాలా మంది అల్పాహారంగా గుడ్లు తీసుకుంటుంటారు. ఇది తిన్న తర్వాత పుచ్చకాయను తింటారు. కానీ ఈ రెండూ కలిపి తినడంవల్ల ఆరోగ్యానికి పెద్ద డేంజర్.
పుచ్చకాయలో 92 % నీరు ఉంటుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇది కాపాడుతుంది. ఇందులో కెరోటినాయిడ్స్ , బీటాకెరోటిన్, విటమిన్ సి , విటమిన్ ఎ , విటమిన్ బి6 , పొటాషియం, బయోటిన్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. గ్లూకోజ్ , ఫ్రక్టోజ్, సుక్రోజ్ కూడా ఉంటాయి.












Click it and Unblock the Notifications