ఫ్రిజ్ Vs మట్టి కుండ నీరు:వేసవిలో ఆరోగ్యానికి ఏది బెస్ట్..!!

వేసవి మొదలైంది. చల్లటి నీరు అందరూ కోరుకుంటారు. ఇప్పటికీ అనేక మంది కుండలోనే వేసవిలో నీరు తాగటానికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే, మారుతున్న కాలంతో పాటుగా చాలా మంది రిఫ్రిజిరేటర్ లో ఉంచి నీటిని తాగేందుకు ఇష్టపడుతున్నారు. అయితే.. కుండ - ఫ్రిజ్ ఈ రెండింటిలో వేటిలో నిల్వ చేసిన నీరు చల్లదనం కోసం వేసవిలో తాగితే ఆరోగ్యానికి మేలు చేస్తుందనేది చాలా మందిలో ఉన్న సందేహం. ఫ్రిజ్ - కుండ లో నీరు తాగటం .. ప్రయోజనాలు.. సమస్యల పైన నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.

వేసవిలో మట్టి కుండలో నిల్వ ఉంచిన నీరు సహజమైన చల్లదనాన్ని, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడం, శరీర pH స్థాయిలను సమ తుల్యం చేయడం, సహజంగా మలినాలను తొలగించడం ద్వారా మెటబాలిజంను పెంచుతుంది. అలాగే, సన్‌స్ట్రోక్ (వడదెబ్బ) నుండి రక్షించి, గొంతుకు హాయిని ఇస్తుంది. కాగా.. ఫ్రిజ్ నీరు తాగడం సాధారణంగా సురక్షితమే అయినా, అతిగా తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

water-stored-in-clay-pots-is-rich-in-minerals-that-help-maintain-electrolyte-balance-here-the-repor

ఇది జీర్ణక్రియను మందగించడం, గొంతు సమస్యలు, జలుబు, శరీర ఉష్ణోగ్రతలో అకస్మాత్తుగా మార్పులు తీసుకురావడం వంటి సమస్యలకు దారితీయవచ్చు. ముఖ్యంగా బయట ఎండలో నుండి వచ్చిన వెంటనే ఫ్రిజ్ నీరు తాగకపోవడం మంచిదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో.. ఫ్రిజ్ నీరు కంటే మట్టి కుండలో నిల్వ చేసిన నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మట్టి కుండ సహజంగా నీటిని చల్లగా ఉంచుతుంది.

కుండ నీటితో ఆరోగ్య ప్రయోజనాలు

అయితే, ఫ్రిజ్ నీరు.. చల్లగా ఉంటుంది కానీ ఎక్కువ చల్లదనం కొద్దిగా కడుపు, జీర్ణక్రియకు ఇబ్బంది కలిగించవచ్చు. వేసవిలో ఫ్రిజ్ నీరు కంటే మట్టి కుండలో నిల్వ చేసిన నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనం తినే ఆహారం వల్ల శరీరంలో అసిడిటీ పెరుగుతుంది. మట్టి సహజంగా ఆల్కలైన్ గుణాన్ని కలిగి ఉంటుంది. ప్లాస్టిక్ బాటిల్స్ లేదా ఫ్రిజ్ నీటిలో కెమికల్స్ ఉండే అవకాశం ఉంటుంది. కానీ మట్టి కుండ నీటిలో ఎటువంటి రసాయనాలు ఉండవు.

ఈ నీటిలోని ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీర జీవక్రియను వేగవంతం చేస్తాయి. వేసవిలో తీవ్రమైన వేడి వల్ల శరీరం త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. మట్టి కుండ నీటిలో ఉండే పోషకాలు, ఖనిజాలు శరీరాన్ని త్వరగా రీహైడ్రేట్ చేయడంలో సహాయపడతాయి. తద్వారా వడదెబ్బతగలకుండా రక్షిస్తాయి. మట్టి కుండ నీరు శ్వాసకోస ఇబ్బందులు ఉన్నవారికి కూడా ఈ నీరు ఎంతో మేలు చేస్తుంది. కృత్రిమమైన చల్లదనం కంటే, ప్రకృతి సిద్ధమైన మట్టి కుండ నీటిని ఎంచుకోవటం శ్రేయస్కరం అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+