వంటింట్లో ఒక్క పదార్ధంతో బరువుకు చెక్ పెట్టొచ్చు!
బరువు తగ్గించడానికి మన వంటింట్లో నిత్యం ఉపయోగించే అనేక పదార్థాలు ఎంతగానో దోహదం చేస్తాయి. ముఖ్యంగా మన వంటింట్లో ఉపయోగించే ధనియాలు బరువు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. యాంటీ ఆక్సిడెంట్లు మరియు విటమిన్లతో సమృద్ధిగా ఉండి, జీర్ణక్రియకు మరియు మెటబాలిజంకి మద్దతు ఇవ్వడానికి ఉపయోగపడే ధనియాలు బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తాయి. ఇక బరువును తగ్గించడంలో కీలకంగా ఉండే ధనియాల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
ధనియాలతో చెడు కొలెస్ట్రాల్ కు చెక్.. ఆరోగ్యం
ధనియాలు ఆహార ఫైబర్ ను ఎక్కువగా కలిగి ఉంటాయి. ఇది మన శరీరంలో జీర్ణక్రియకు సహాయం చేస్తుంది. అంతేకాదు ఎక్కువ తినడాన్ని కూడా నిరోధిస్తుంది. ధనియాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదం చేస్తాయి. ప్రతిరోజు మన భోజనంలో ధనియాలు ఉండేలా చూసుకుంటే మొత్తం ఆరోగ్యానికి దోహదం చేస్తుంది

ధనియాలను ఆహారంలో ఇలా చేర్చుకుంటే బెస్ట్
ధనియాలను మనం వివిధ రూపాలలో ఉపయోగించవచ్చు. రాత్రంతా నానబెట్టి నీళ్లను ఉదయం తాగడం ఒక విధానం అయితే కొద్దిగా వేయించి పొడి చేసుకుని ఉదయం వేడినీళ్లలో కలుపుకొని తాగడం మరొక విధానం. ఇది మాత్రమే కాకుండా మనం చేసుకునే వంటలలో ధనియాల పొడిని, ధనియాలను కలుపుకొని చేసుకోవడం కూడా మనకు ఎంతగానో దోహదం చేస్తుంది.
ధనియాలలో పోషకాలు ఇలా
వివిధ రకాల సూప్ లలో, కూరలలో, సలాడ్లలో ధనియాలను చేర్చుకుంటే మనకు ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. వంద గ్రాముల ధనియాలలో 298 క్యాలరీలు ఉంటాయి. 12.37 గ్రాముల ప్రోటీన్, 41.9 గ్రాముల డైటరీ ఫైబర్, 709 మిల్లీగ్రాముల క్యాల్షియం, 16.32 మిల్లీగ్రాముల ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ధనియాలు మన కండరాల నిర్మాణానికి, ఎముకల ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.
సహజ ప్రత్యామ్నాయాల కోసం చూసే వారికి ధనియాలు బెస్ట్
మన శరీరానికి కావలసిన ప్రోటీన్ అందించటానికి కూడా దోహదం చేస్తాయి. ఆరోగ్యంగా ఉండడానికి సహజ ప్రత్యామ్నాయాల కోసం ప్రజలు చూస్తున్న క్రమంలో మన వంటింట్లో ఉండే అనేక పదార్థాలు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి దోహదం చేస్తున్నాయి. బరువును తగ్గించడానికి కీలకంగా పనిచేస్తున్నాయి.అయితే ప్రతీరోజూ క్రమ పద్దతిలో, నిర్దిష్ట మోతాదులో వాడాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications