నాటు గుడ్డు..ఫారం గుడ్డు - ఆరోగ్యకర పోషకాలు ఎందులో ఎక్కువ..!?

కోడిగుడ్డు ఒక పోషకాల గని. గుడ్లలో అనేక పోషకాలు, విటమిన్స్, మినరల్స్ అధికంగా ఉండటమే కాకుండా ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా ఉంటాయి. అందువలన ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. షుగర్ ఉన్నవారు కూడా మితంగా గుడ్లు తినవచ్చు అంటున్నారు నిపుణులు. అయితే, నాటు కోడి గుడ్డు మంచిదా ఫారం కోడిగుడ్డు మంచిదా అనే సందేహం ఎక్కువగా కనిపిస్తోంది. దీని పైన పోషకాహార నిపుణులు స్పష్టత ఇస్తున్నారు. రెండు రకాల గుడ్లలో ఉండే పోషకాలు.. రెండింటి లో ఏది మంచిదో తేల్చి చెబుతున్నారు.

కోడిగుడ్డు శరీరానికి అనేక రకాలుగా మేలు చేస్తుంది. కోడి గడ్డును ఉడక బెట్టి లేదా గిలకొట్టి ఏవిధంగా తీసుకున్నా ఆరోగ్యానికి మంచిదే, కానీ ఎక్కువగా బాయిల్డ్ ఎగ్ శరీరానికి చాలా మేలు చేస్తుందంట. ముఖ్యంగా ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. రోజుకు ఒక కోడి గుడ్డు తీసుకోవడం వలన ఇది గుండె పోటు, స్ట్రోక్, లేదా ఇతర హృదయ సంబంధ వ్యాధుల నుంచి కాపాడుతుంది. అంతే కాకుండా రక్త నాళాల్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను తొలగించడంలో కూడా సహాయపడుతుంది. గుడ్డు తీసుకోవడం వల్ల శరీరం బరువును అదుపులో ఉంచుతుంది. అల్పాహారంగా కోడిగుడ్డును తీసుకుంటే మంచిది. వాటిని తరచూ తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

what-is-the-real-difference-between-brown-eggs-and-white-eggs

ఇక, ఫారం కోడిగుడ్డులోనైనా.. నాటు కోడి గుడ్డులోనైనా పోషకాలు ఒకే విధంగా ఉంటాయి. ఏ గుడ్డు తిన్నా.. పోషకాలు మాత్రం శరీరానికి పుష్కలంగా అందుతాయి. ప్రోటీన్ల స్థానంలో గుడ్డు అగ్ర స్థానంలో ఉంది. పప్పుల్లో ఉండే ప్రోటీన్లతో పోలిస్తే గుడ్డులోని ప్రోటీన్లే చాలా త్వరగా జీర్ణం అవుతాయి. ఇవి పిల్లల ఎదుగుదలకు సహాయపడతాయి. అందుకే గుడ్డును సంపూర్ణ ఆహారం అంటారు. నాటు కోడి గుడ్డులో పోషకాలు అధికంగా ఉంటాయని అంతా అనుకుంటారని.. కానీ అందులో వాస్తవం లేదని చెబుతున్నారు. ఈ రెండు రకాల గుడ్డుల్లో ఒకే పరిమాణంలో పోషకాలు ఉంటాయని వివరిస్తున్నారు. గుడ్డు తినడం వల్ల మహిళల్లో రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. రోజుకు ఒక గుడ్డు తినటం ద్వారా శరీరానికి కావాల్సిన శక్తితో పాటుగా జీవక్రియ ను మెరుగు పర్చుతుందని నిపుణులు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+