కండరాల బలానికి ఈ ఫుడ్ తీసుకోండి, ఇవి పాటించండి..!!
ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే కండరాల బలం చాలా అవసరం. ఇందు కోసం శారీరక శ్రమ తో పాటుగా అవసరమైన ఆహారం తీసుకోవాలి. సంతులిత ఆహారం, తగినంత విశ్రాంతి, నియమబద్ధమైన వ్యాయామం వల్ల కండరాలు శక్తిమంతం అవుతాయి. అయితే, కండరాలను బలంగా ఉంచడంలో క్రియాటిన్ కీలక పాత్ర పోషిస్తుంది. అనేక పదార్ధాల్లో ఇది పుష్కలంగా లభిస్తుంది. అదే సమయంలో ఈ ఆహారం తీసుకోవటం పరిమితి అవసరం. కండరాల బలం కోసం నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
కండరాల బలం కోసం కీలక పాత్ర పోషించే క్రియోటిన్ కోడి మాంసం, సాల్మన్, ట్యూనా, కాడ్ లాంటి చేపల్లో పుష్కలంగా ఉంటుంది. వెయిట్ లిఫ్టింగ్, స్ప్రింటింగ్ లాంటివి చేసేవారికి క్రియాటిన్ చాలా అవసరం. అదే విధంగా బీటెయిన్ కండరాల పనితీరును మెరుగు పరుస్తుంది. ఇది బీట్‌రూట్, పాలకూర, కినోవా, మొరంగడ్డ, వీట్ బ్రాన్ మొదలైన వాటిలో పుష్కలంగా ఉంటుంది. వ్యాయామం చేసే సమయంలో ఇది మజిల్ ఎండ్యూరెన్స్, హైడ్రేషన్‌కు తోడ్పడుతుంది. ఇక.. మైటోకాండ్రియా కణాలకు ఫ్యాటీ ఆమ్లాలను రవాణా చేసేదే కార్నిటైన్. ఇది ఎక్కువగా మాంసం (రెడ్‌మీట్), పౌల్ట్రీ, పాల పదార్థాలు, అవకాడో, ఆస్పాగరస్ తదితర ఆహార పదార్థాల్లో ఉంటుంది. వ్యాయామం చేసే వాళ్లు వీటిని ఎక్కువ మోతాదులో తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఇది కండరాల బలహీనతను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది.

వీటితో పాటుగా బ్రాంచ్డ్ చెయిన్ అమైనో యాసిడ్స్ (బీసీఏఏ)లో ల్యూసిన్, ఐసోల్యూసిన్, వాలిన్ వంటి అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇవి పాల పదార్థాలు, సోయాబీన్స్, లెంటిల్స్, గింజలు, విత్తనాలు, గుడ్లలో పుష్కలంగా ఉంటాయి. వ్యాయామం సమయంలో కండరాలు ఈ అమైనో ఆమ్లాలను నేరుగా ఖర్చు చేస్తాయి. దానివల్ల మజిల్ బ్రేక్ డౌన్ జరగదు. ఈ బీసీఏఏలు అధిక వ్యాయామం సమయంలో ఏర్పడే కండరాల బలహీనతను తగ్గిస్తుంది. అలాగే కండరాలు దెబ్బతిన్నప్పుడు, ఇవి త్వరగా నయం చేస్తాయి. ఇక, ఆహారంతో పాటుగా ఆరోగ్య కరమైన జీవన విధానం.. నిరంతరం ప్రణాళికా బద్దంగా వ్యాయామం అవసరం. రోజు ఒక నిర్దేశిత టైం టేబుల్ మేరకు జీవన విధానం అలవర్చుకుంటే శారీరకంగా బలం పెరగటంతో పాటుగా మానసికంగానూ బలం పెరుగుతుంది.
-
అటుకులు.. చెప్పలేనన్ని ప్రయోజనాలు -
పాలకూర రాగి ఇడ్లీ.. ఇలా చేసి తింటే రుచి మాత్రమేనా ఆరోగ్యం కూడా -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ?












Click it and Unblock the Notifications