టమోటాలు తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా...? వీరు దూరంగా ఉండాలి..!!
టమోటాలు. ప్రతీ ఇంటా వినియోగిస్తారు. దాదాపుగా అన్ని వంటల్లోనూ వాడతారు. టమోటా రుచి తో పాటుగా ఆరోగ్య పరమైన ప్రయోజనాలు ఉన్నవిగా చెబుతారు. అయితే, టమోటా వల్ల ఎన్ని లాభాలుంటాయో.. నష్టాలూ అంతే ఉంటాయి. రోజూ తింటే మూత్రపిండాల్లో రాళ్లు వస్తాయనే ఒక అపోహ ఎక్కువగా ప్రచారంలో ఉంది. అయితే, నిజంగా టమోటా కారణంగా మూత్ర పిండాల్లో రాళ్లు వస్తాయా.. అసలు టమోటా కు ఎవరు దూరంగా ఉండాలి.. ఇలాంటి అనుమానాలకు నిపుణులు స్పష్టత ఇస్తున్నారు.
నిత్యం వినియోగించే టమోటాల్లో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. దీనితో పాటు లైకోపీన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాల అభివృద్ధిని నిరోధిస్తుంది. పొటాషియం గుండె ఆరోగ్యానికి, బిపిని నియంత్రణకు సహకరిస్తుంది. టమోటాలోని విటమిన్ కె, ఫోలేట్, ఫైబర్ ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఎర్ర రక్త కణాల పెరుగుదలకు తోడ్పడతాయి. జీర్ణ శక్తిని పెంచుతాయి. అయితే, టమోటాలలో అధిక మొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇవి శరీరంలోని కాల్షియంతో కలిసి స్ఫటికాలను ఏర్పరుస్తాయి. ఇవి రాళ్లలా గట్టిగా మారుతాయి. క్రమంగా మూత్రపిండాలలో పేరుకుపోతాయి. ఇదివరకే కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా టమోటాలు తింటే సమస్య మరింత తీవ్రమవుతుంది.

ముఖ్యంగా మూత్రపిండాల సమస్యలు ఉంటే పచ్చి టమోటాలు ఎట్టి పరిస్థితుల్లో తినకూడదని నిపుణులు సూచిస్తున్నారు. కిడ్నీ ప్రాబ్లెమ్స్ లేని వ్యక్తులు నిస్సంకోచంగా టమోటాలు తినవచ్చు. కానీ తగిన పరిమాణంలో తినాలి. అలాగే, టమోటాలతో పాటు ఇతర ఆహారాలను కూడా తప్పక తీసుకోవాలి. టమోటాలు రోజూ తింటే బీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయని చెబుతున్నారు. ఒక అధ్యయనం ప్రకారం, 12 వారాల పాటు ప్రతిరోజూ 100 గ్రాముల కంటే ఎక్కువ టమోటాలు తినేవారిలో మూత్రపిండాల్లో రాళ్లు కని పించాయి. ఈ రోగుల మూత్రంలో ఆక్సలేట్ స్థాయిలు పెరిగాయి. కాగా, ఈ పెరుగుదల సాధార ణమైనప్పటికీ టమోటాలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి, అధిక మోతాదులో టమోటాలను తీసుకునే వారు లేదా టమోటా ప్యూరీలు, సాస్ వంటి ప్రాసెస్డ్ ఫార్ముల్లో వీటిని తరచుగా ఉపయోగించే వారు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications