ఏపీకి లక్షకోట్ల వరం.. హార్టీకల్చర్ హబ్ తో రాయలసీమ ఇకపై రతనాల సీమ!

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాయలసీమ ప్రాంతానికి శుభవార్త చెప్పాయి. రూ.లక్ష కోట్లతో ప్రారంభించనున్న హార్టీకల్చర్ హబ్ తో దేశంలోనే రాయలసీమ అతిపెద్ద ఉద్యానవన క్షేత్రంగా మార్చేలా శ్రీకారం చుడుతున్నాయి. ఇదే విషయాన్ని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం ద్వారా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గాంధీ జయంతి సాక్షిగా శ్రీకారం చుడుతున్నామన్నారు.

సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. గ్లోబర్ హార్టీకల్చర్ హబ్ తో రాయలసీమ రూపురేఖలు మారిపోతున్నాయన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి సవిత మాట్లాడారు. రాళ్లసీమగా మారిన రాయలసీమ సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో సస్యశ్యామలంగా మారుతోందన్నారు.

Rayalaseema Horticulture Hub AP to set up Rs1lakh crore Horticulture Hub Foundation on october 2

ఇప్పటికే రాయసీమలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారన్నారు. ఇపుడు రూ.లక్ష కోట్లతో రాయలసీమలో హార్టీకల్చర్ హబ్ ఏర్పాటుకు నిర్ణయించారన్నారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమలో వాణిజ్య పంటలు సాగుకు పెద్ద ఎత్తున అవకాశం కలుగుతుందని మంత్రి సవిత అన్నారు. రాబోయే రెండున్నర సంవత్సరాల్లో రాయలసీమ దేశంలో అతిపెద్ద వ్యవసాయ క్షేత్రంగా ఆవిర్భవించనుందని మంత్రి తెలిపారు.

హార్టీకల్చర్ హబ్ ప్రాజెక్టులో భాగంగా 13జిల్లాల పరిధిలోని 201క్లస్టర్లలో వినూత్న పంటల సాగును ప్రోత్సహించనున్నట్లు మంత్రి సవిత తెలిపారు. దీని వలన 14.41 లక్షల హెక్టార్లకు ఉద్యానవన సాగు విస్తీర్ణం పెరుగుతుందన్నారు. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి పెంచేలా మైక్రో ఇరిగేషన్ కు మరింతపెద్ద పీట వేస్తున్నామన్నారు. సాగునీటి రంగానికి రూ. 26 వేల కోట్లను వెచ్చిస్తున్నామని, ఈ నిధులతో రాయలసీమలోని 52 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయనున్నామని తెలిపారు.

పంట నిల్వ చేయడానికి కోల్డ్ స్టోరేజ్, ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. వాటి ద్వారా పంట వృథాను అరికట్టడమే కాకుండా, రైతులకు ఆర్థిక మేలు కలుగుతుందన్నారు.
అయిదేళ్ల ఏళ్ల జగన్ పాలనలో రాయలసీమకు, ఈ ప్రాంత రైతంగానికి చేసిందేమీ లేదని మంత్రి సవిత విమర్శించారు. మడకశిరకు, కుప్పానికి, పులివెందులకు కృష్ణా జలాలు అందించన ఘనత సీఎం చంద్రబాబుదేనన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలోని ప్రతి ఎకరాకూ నీరందిస్తామన్నారు.

హైదరాబాద్‌లో ప్రాణాంతక ఫేస్ క్రీమ్‌లు స్వాధీనం.. టాస్క్ ఫోర్స్ దాడుల్లో షాకింగ్ విషయాలు!
హైదరాబాద్‌లో ప్రాణాంతక ఫేస్ క్రీమ్‌లు స్వాధీనం.. టాస్క్ ఫోర్స్ దాడుల్లో షాకింగ్ విషయాలు!

రాయలసీమలో ఒకవైపు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పెద్ద ఎత్తున పరిశ్రమలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. అక్టోబర్ రెండో తేదీన గాంధీ మహాత్ముని జయంతి సందర్భంగా మదనపల్లెలో సీఎం చంద్రబాబునాయుడు, కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేతుల మీదుగా హార్టీకల్చర్ హబ్ కు శ్రీకారం చుడుతున్నామన్నారు. రూ.లక్ష కోట్లతో హార్టీకల్చర్ హబ్ ఏర్పాటుతో రాయలసీమ రూపు రేఖలే మారిపోతాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+