వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

GAIL ఇండియా లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు: మంచి జీతం..అర్హతలు ఇవే..!!

|
Google Oneindia TeluguNews

భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో మహారత్న సంస్థగా పేరుగాంచింది గెయిల్ ఇండియా లిమిటెడ్. సహజ వాయువు సంస్తలో పరిశోధనలు, ఉత్పత్తి, ప్రాసెసింగ్ ట్రాన్స్‌మిషన్, సరఫరా మరియు మార్కెటింగ్ జరుగుతుంది. త్వరలోనే మరో ముందడుగు దిశగా గెయిల్ పయనిస్తోంది. గ్రీన్ ఎనర్జీ కారిడార్లుగా దేశంలోని పలు వినియోగ కేంద్రాలను అనుసంధానం చేయాలని భావిస్తోంది. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్లో గెయిల్ సంస్థ అడుగుపెట్టి అక్కడ వాణిజ్యంపై కన్నేసింది. ఇందుకోసం ప్రణాళిక కూడా సిద్దం చేసింది. ఇలాంటి సంస్థలో పనిచేయాలంటే ఎవరికైనా ఆసక్తి ఉంటుంది. అలాంటి ఆసక్తి కలిగి గెయిల్ సూచించిన అన్ని అర్హతలు ఉన్న అభ్యర్థులు ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉద్యోగ ప్రకటన జారీ చేసింది ఈ మహారత్న కంపెనీ.

ప్రభుత్వ రంగ సంస్థ మహారత్న కంపెనీ గెయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఎన్ని పోస్టులు భర్తీ చేయనుందో అనే వివరాలను మాత్రం త్వరలో చెబుతామని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇందుకోసం అభ్యర్థులను గేట్ -2022లో వచ్చిన మార్కుల ఆధారంగా పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొంది. కాబట్టి గెయిల్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో పనిచేయాలని భావిస్తున్న అభ్యర్థులు గేట్‌ పరీక్షలో మంచి మార్కులు సంపాదించాల్సి ఉంటుంది. మూడు విభాగాలకు ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలను ఎంపిక చేయనుంది. అవి ఇన్స్‌ట్రుమెంటేషన్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలను నియమించుకోనుంది.

GAIL Recruitment 2021:Apply for Executive posts

అభ్యర్థులకు ఈ కింద విధంగా అర్హతలు కలిగి ఉండాలి:

1) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఇన్స్‌ట్రుమెంటేషన్): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఇన్స్‌ట్రుమెంటేషన్‌/ ఇన్స్‌ట్రుమెంటేషన్ &కంట్రోల్/ ఎలక్ట్రానిక్స్ & ఇన్స్‌ట్రుమెంటేషన్/ ఎలక్ట్రికల్ & ఇన్స్‌ట్రుమెంటేషన్ లో 65శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ

2) ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (మెకానికల్): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మెకానికల్/ప్రొడక్షన్/ప్రొడక్షన్ మరియు ఇండస్ట్రియల్/మానుఫాక్చరింగ్/ మెకానికల్ మరియు ఆటోమొబైల్‌లో 65శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ

3)ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ (ఎలక్ట్రికల్): గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి 65శాతం మార్కులతో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ కలిగి ఉండాలి

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 60శాతం ఉత్తీర్ణత ఉంటే సరిపోతుంది.

చివరి సంవత్సరం అంటే 2021-22లో ఉన్న విద్యార్థులు కూడా ఈ పోస్టులకు అప్లయ్ చేయొచ్చు. వారు తమ మూడేళ్ల సెమిస్టర్స్‌కు సంబంధించిన మార్కులిస్టులు రుజువుగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే 2020 లేదా 2020 కంటే ఇంజినీరింగ్ పూర్తి చేసిన విద్యార్థులు ఈ పోస్టులకు అర్హులు కాదని నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఇక అభ్యర్థుల వయసు విషయానికొస్తే 2022 మార్చి 16 నాటికి గరిష్టంగా 26 ఏళ్లు ఉండాలి. అయితే రిజర్వేషన్ అభ్యర్థులకు వయసులో మినహాయింపు ఉంటుంది.

ఎంపికైన అభ్యర్థులకు వేతనంతో పాటు ఇతర అలవెన్సులు సైతం ఉంటాయి . ఇందులో భాగంగా వేరియబుల్ డియర్‌నెస్ అలవెన్స్, వేరియబుల్ పే, ఇతర బెనిఫిట్లు, సూపర్‌యానువేషన్ బెనిఫిట్లు ఉంటాయి. ఇక గెయిల్‌లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ముందుగా గెయిల్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. gailonline.comకు లాగిన్ అయి గేట్-2022 రిజిస్ట్రేషన్ నెంబర్ పొందుపర్చాలి. దీనికి సంబంధించిన లింకు 2022 ఫిబ్రవరి 15 నుంచి 2022 మార్చి 16వరకు అందుబాటులో ఉంటుంది.

ఇక పూర్తి వివరాల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు gailonline.comను సందర్శించి అందులో Careers సెక్షన్‌ను చూడగలరు.

English summary
Gas Authority of India limited (GAIL) has issued notification to fillup executive trainee posts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X