ఆర్బీఐ గోల్డెన్ ఛాన్స్.. భారీ జీతంతో ఉద్యోగాలు.. రేపే లాస్ట్ డేట్ ???

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు భారీ శుభవార్త. Reserve Bank of India (RBI) అసిస్టెంట్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతీయ కార్యాలయాల్లో మొత్తం 650 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. బ్యాంకింగ్ రంగంలో కెరీర్ చేయాలని ఆశిస్తున్న యువతకు ఇది ఒక గోల్డెన్ ఛాన్స్‌గా చెప్పవచ్చు.

దేశవ్యాప్తంగా 17 నగరాల్లో నియామకాలు..

ఈ నియామకాల ప్రక్రియ ద్వారా దేశంలోని 17 ప్రధాన నగరాల్లో ఉన్న RBI కార్యాలయాల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు ఆయా ప్రాంతీయ కార్యాలయాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది. అత్యధికంగా ముంబై కార్యాలయంలోనే ఖాళీలు ఉన్నాయి.

reserve-bank-of-india-notification-for-650-assistant-posts-across-the-nation-and-complete-details

రాష్ట్రాల వారీగా ఖాళీలు..

ముంబై - 249

చెన్నై - 53

కాన్పూర్ - 50

లఖ్‌నవూ - 50

న్యూఢిల్లీ - 49

గువాహటి - 36

భోపాల్ - 30

అలానే తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల కోసం హైదరాబాద్ కార్యాలయంలో 11 ఖాళీలు కేటాయించారు. అదనంగా కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్, చండీగఢ్, భువనేశ్వర్, నాగ్‌పూర్, పట్నా, జైపూర్, తిరువనంతపురం, జమ్మూ నగరాల్లో కూడా నియామకాలు చేపట్టనున్నారు.

విద్యార్హతలు..

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం కేవలం ఉత్తీర్ణత మార్కులు ఉంటే సరిపోతుంది. అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం, వర్డ్ ప్రాసెసింగ్ నైపుణ్యం ఉండటం తప్పనిసరి. అభ్యర్థులు దరఖాస్తు చేసే ప్రాంతానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం తెలిసి ఉండాలి.

వయస్సు పరిమితి..

అభ్యర్థుల వయస్సు 2026 ఫిబ్రవరి 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ..

ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో కొనసాగుతుంది.

1. ప్రిలిమినరీ పరీక్ష:
ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ అంశాలపై ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.

2. మెయిన్స్ పరీక్ష:
రీజనింగ్, ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ వంటి విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

3. లాంగ్వేజ్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ (LPT):
అభ్యర్థులు దరఖాస్తు చేసిన ప్రాంతానికి సంబంధించిన భాషలో నైపుణ్యాన్ని పరీక్షిస్తారు.

మెయిన్స్ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది మెరిట్ లిస్ట్ రూపొందిస్తారు. అయితే భాషా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.

జీతం & ఇతర ప్రయోజనాలు..

ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ వేతనం నెలకు రూ. 58,514 ఉంటుంది. దీనికి తోడు డియర్‌నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, మెడికల్ బెనిఫిట్స్, ట్రావెల్ అలవెన్స్ వంటి అనేక సౌకర్యాలు కూడా లభిస్తాయి. ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో స్థిరమైన కెరీర్ కోసం ఇది మంచి అవకాశం.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు..

అభ్యర్థుల కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, గుంటూరు, కర్నూలు, కాకినాడ, రాజమహేంద్రవరం, నెల్లూరు, వరంగల్, కరీంనగర్, ఖమ్మం వంటి నగరాల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

దరఖాస్తు విధానం..

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. సాధారణ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 450 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ. 50 ఇంటిమేషన్ ఛార్జీలు మాత్రమే ఉంటాయి.

దరఖాస్తు గడువు..

ఫిబ్రవరి 16, 2026 నుంచి మార్చి 8, 2026

ప్రిలిమినరీ పరీక్ష: ఏప్రిల్ 11 (తాత్కాలికంగా)

మెయిన్స్ పరీక్ష: జూన్ 7 (తాత్కాలికంగా)

అభ్యర్థులు పూర్తి వివరాల కోసం RBI అధికారిక వెబ్‌సైట్‌ https://opportunities.rbi.org.in/ ను సందర్శించవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+