AP SSC Hall tickets: పదో తరగతి హాల్ టికెట్లు రెడీ-డౌన్ లోడ్ ఇలా..!
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్ల (ap ssc hall tickets)విడుదలకు రంగం సిద్దమైంది. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు వీటిని రేపటి నుంచి అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రాథమిక విద్య బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అలాగే వీటిని నేరుగా కూడా డౌన్ లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. విద్యార్ధులు తాము చదువుకున్న పాఠశాలలతో పాటు ఆన్ లైన్, వాట్సాప్ లోనూ వీటిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఈ నెలలో ప్రారంభమయ్యే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు అధికారులు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా హాల్ టికెట్ల విడుదలకు రంగం సిద్దం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ హాల్ టికెట్లు విడుదల చేస్తారు. పదో తరగతి పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు రేపు హాల్ టికెట్లు అధికారికంగా విడుదల కాగానే డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుగా అధికారులు వివరాలు ప్రకటించారు. విద్యార్ధులు www.bse.ap.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అనంతరం ప్రింట్ తీసుకుని పరీక్షకు హాజరు కావాలి.

అలాగే వాట్సాప్ ద్వారా మనమిత్ర నంబర్ 9552300009 ను ఫోన్ లో సేవ్ చేసుకుని హాయ్ అని టైప్ చేస్తే ప్రభుత్వం అందించే సేవలన్నీ వస్తాయి. ఇందులో విద్యాశాఖ ఆప్షన్ లోకి వెళ్లి పదో తరగతి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం కల్పించారు. వీటితో పాటు పాఠశాలల్లో లీప్ యాప్ ద్వారా కూడా విద్యార్ధులు వీటిని తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు ఉన్నా విద్యార్ధులు తాము చదువుతున్న స్కూల్ హెడ్మాస్టర్లను సంప్రదించాలని విద్యాశాఖ సూచిస్తోంది.












Click it and Unblock the Notifications