CBSE Board Exams postponed: సీబీఎస్ఈ పరీక్షలు మళ్లీ వాయిదా-ఎక్కడెక్కడంటే?
కేంద్ర ప్రాథమిక విద్య బోర్డు (CBSE) ఈ ఏడాది నిర్వహిస్తున్న 10, 12 తరగతుల బోర్డు పరీక్షలకు ఆటంకాలు తప్పడం లేదు. వివిధ కారణాలతో బోర్డు పరీక్షల్లో మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇబ్బందులు ఉన్న చోట్ల పరీక్షలను వాయిదా వేస్తూ వస్తున్న సీబీఎస్ఈ బోర్డు ఇవాళ మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 5, 6 తేదీల్లో కొన్ని సెంటర్లలో జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
భారత్ తో పాటు 26 దేశాల్లో సీబీఎస్ఈ ఈ ఏడాది 10, 12 తరగతులకు బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. ఇందులో 46 లక్షల మంది విద్యార్ధులు పాల్గొంటున్నారు. అయితే పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్ధితుల నేపథ్యంలో అక్కడ బోర్డు పరీక్షలు నిర్వహించే అవకాశం లేకుండా పోతోంది. దీంతో పలు పశ్చిమాసియా దేశాల్లో బోర్డు మార్చి 5, 6 తేదీల్లో జరగాల్సిన పరీక్షల్ని వాయిదా వేస్తూ సీబీఎస్ఈ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇలా ఏయే దేశాల్లో పరీక్షలు వాయిదా పడ్డాయో వివరాలు వెల్లడించింది.

సీబీఎస్ఈ ప్రకటన ప్రకారం .. బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలోని పరీక్ష కేంద్రాల్లో ఈ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు ఆయా దేశాల్లోని బోర్డు అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాల్స్‌కు అధికారులు సమాచారం ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల అంచనా తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. ప్రభావిత ప్రశ్నపత్రాలకు కొత్త తేదీలను తరువాత ప్రకటిస్తారు. మార్చి 5న పరిస్థితిని సీబీఎస్ఈ మళ్ళీ సమీక్షించి.. మార్చి 7 నుండి జరగాల్సిన పరీక్షలపై నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి విద్యార్థులు తమ పాఠశాలలతో టచ్‌లో ఉండాలని, అధికారిక అప్ డేట్స్ ను ఫాలో కావాలని కోరుతోంది.












Click it and Unblock the Notifications