India Post GDS Result 2026: పోస్టాఫీస్ జాబ్స్ మెరిట్ లిస్ట్ విడుదల-ఇలా చెక్ చేసుకోండి..!

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని జోన్లు, సర్కిళ్లలో ఉన్న పోస్టాఫీసుల్లో బ్రాంచ్ పోస్టు మాస్టర్లు, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్టర్లు, గ్రామీణ్ డాక్ సేవక్ ఉద్యోగాల కోసం తపాలా శాఖ (india post) గత నెలలో నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు తొలి మెరిట్ లిస్టును (GDS result 2026)విడుదల చేసింది. పదో తరగతి అర్హతతో వివిధ సర్కిళ్లలో భర్తీ చేస్తున్న 28636 పోస్టులకు సంబంధించిన మెరిట్ లిస్టు అందుబాటులోకి వచ్చింది.

ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించి గత నెలలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ఫలితాలను ఖరారు చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు వారి పదో తరగతిలో మార్కుల ఆధారంగా పోస్టల్ శాఖ ఆటోమేటిగ్గా ఆన్ లైన్ లో మెరిట్ లిస్ట్ పెట్టింది. ఈ ఫలితాలను తెలుసుకునేందుకు అభ్యర్ధులు తాము దరఖాస్తు చేసిన అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.

India Post GDS Result 2026 First Merit List for 28 636 Posts released-here is how to check

పోస్టల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్దులు https://indiapost.gov.in/gdsonlineengagement వెబ్ సైట్ లోకి వెళ్తే మెరిట్ లిస్ట్ కనిపిస్తుంది. సైట్ ఓపెన్ చేయగానే ఎడమ చేసి వైపు కింద భాగంలో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ పేరుతో ఓ లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే మీ రాష్ట్రం పేరు కనిపిస్తుంది. అందులో లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ మరో మరో లింక్ కనిపిస్తుంది. అందులోకి వెళ్తే జోన్ల వారీగా ఫలితాలు కనిపిస్తాయి. కీ బోర్డులో కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తే పైన సెర్చ్ విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ రిజిస్ట్రేషన్ నంబర్ ఎంటర్ చేస్తే నేరుగా ఫలితం కనిపిస్తుంది. ఇందులో పేరు లేకపోతే మాత్రం ఎలాంటి ఫలితం కనిపించదు. అయితే ఇదే చివరి ఫలితం కాదు. త్వరలో మరిన్ని మెరిట్ లిస్ట్ లు విడుదల చేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+