వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

IRCONలో ఉద్యోగాలు: గ్రాడ్యుయేట్ మరియు డిప్లొమా అప్రెంటిస్ పోస్టులకు అప్లయ్ చేయండి..!!

|
Google Oneindia TeluguNews

రైల్వేలో ఉద్యోగం పొందాలనుకుని ఎదురు చూసే వారికి శుభవార్త. ఇండియన్ రైల్వేస్ అనుబంధ సంస్థగా కొనసాగుతోన్న ఇండియన్ రైల్వే కన్స్‌ట్రక్షన్ లిమిటెడ్ సంస్థ పలు ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు ఇంజినీరింగ్ డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను అందులో పొందుపర్చింది. ఇండియన్ రైల్వే కన్స్‌ట్రక్షన్ లిమిటెడ్ (ఇర్కాన్) అనే ఈ సంస్థ ఇండియన్ రైల్వేస్‌కు చెందిన ఇంజినీరింగ్ మరియు కన్స్‌ట్రక్షన్ కార్పొరేషన్‌కు అనుబంధంగా ఉంది. ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ దీని ప్రత్యేకత. కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం రైల్వేస్ ఈ సంస్థను 1976లో ఏర్పాటు చేసింది.

ఇక ఇర్కాన్ విడుదల చేసిన నోటిఫికేషన్ విషయానికొస్తే ఈ సంస్థలో మొత్తం 32 అప్రెంటిస్ పోస్టుల ఖాళీగా ఉన్నాయి. అవి ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ మరియు ఇంజినీరింగ్ డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్ . ఈ పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా ఎలాంటి పరీక్ష లేదా ఇంటర్వ్యూ నిర్వహించడం లేదు. కేవలం విద్యాఅర్హతలను బట్టి అందులో వచ్చిన మార్కుల ఆధారంగా లేదా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్టు చేయడం జరుగుతుంది. ఈ నియామకాలు పూర్తిగా ఒప్పంద ప్రాతిపదికనే ఉంటాయి. పోస్టుల పరంగా చూస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ సివిల్ 12 పోస్టులు, గ్రాడ్యుయేట్అప్రెంటిస్ ఎలక్ట్రికల్ 4 పోస్టులు, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఎస్‌&టీ 3 పోస్టులు, డిప్లొమా అప్రెంటిస్- సివిల్ 8 పోస్టులు, డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్ ఎలక్ట్రికల్ 3 పోస్టులు,డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్ ఎస్‌&టి 2 పోస్టులు ఉన్నాయి.

IRCON Recruitment 2021:Apply for Graduate and Diploma Apprentice posts

ఈ పోస్టులకు అర్హత వివరాలు ఇలా ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ఇంజినీరింగ్, ఎస్‌&టిలో బీఈ/బీటెక్ చేసి ఉండాలి. ఇక డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్శిటీ లేదా బోర్డు నుంచి సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎస్‌&టి విభాగాల్లో డిప్లొమా చేసి ఉండాలి. ఇక వేతనం విషయానికొస్తే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు స్టయిపెండ్ కింద నెలకు రూ. 10వేలు చెల్లిస్తారు. అదే డిప్లొమా (టెక్నీషియన్) అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.8500/- స్టయిపెండ్‌గా చెల్లిస్తారు.

అర్హులైన అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 30 ఏళ్లు ఉండాలని అయితే ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్లు వర్తిస్తాయని కంపెనీ విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేసింది. అభ్యర్థులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన పనిలేదు.

ఇక పూర్తి వివరాల కోసం ఈ వెబ్‌సైట్‌ను సందర్శించండి: www.ircon.org

English summary
IRCON International Limited had issued notification to fill up Apprentice jobs which are notified as 32.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X