బిగ్ అలర్ట్.. నీట్ యూజీ 2026 ఆన్‌లైన్ దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్ ??

భారతదేశంలో వైద్య విద్యలో ప్రవేశాలకు అత్యంత కీలకమైన పరీక్షగా భావించే NEET-UG 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ పరీక్షను నిర్వహించే National Testing Agency ప్రకారం దరఖాస్తు చేసుకునేందుకు ఇవ్వబడిన గడువు బుధవారం (మార్చి 11) రాత్రి 9 గంటలతో ముగియనుంది. దీంతో ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ గడువులోగా వెంటనే అప్లై చేయాలని సూచించారు.

దేశంలో అత్యంత పోటీగా జరిగే ప్రవేశ పరీక్షల్లో నీట్ యూజీ ఒకటి. ప్రతి సంవత్సరం 20 లక్షలకు పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతుంటారు. ఫలితాల ఆధారంగా కేంద్ర మరియు రాష్ట్ర స్థాయి కౌన్సెలింగ్ నిర్వహించి మెడికల్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు చేస్తారు. ముగింపు గడువులోగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని.. మరోమారు దరఖాస్తు గడువు పొడిగింపు ఉండబోదని ఎన్టీయే స్పష్టం చేసింది.

today-is-the-last-date-for-neet-ug-2026-online-application-and-complete-details-about-the-process

దరఖాస్తు గడువు ముగింపు..

మొదట ప్రకటించిన నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు గడువు మార్చి 8తో ముగియాల్సి ఉంది. అయితే అభ్యర్థుల అభ్యర్థనల మేరకు National Testing Agency ఈ గడువును మార్చి 11 వరకు పొడిగించింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రకటనలో చివరి తేదీ వరకు దరఖాస్తు పూర్తి చేయాలని సూచించింది. ఇప్పటికే లక్షలాది మంది విద్యార్థులు అప్లై చేసుకున్నారు. ఇంకా దరఖాస్తు చేయని వారు చివరి గడువు ముగిసేలోపు వెంటనే అప్లికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు.

ఫీజు చెల్లించేందుకు ప్రత్యేక గడువు..

దరఖాస్తు ప్రక్రియ రాత్రి 9 గంటలతో ముగిసినా, అప్లికేషన్ ఫీజు చెల్లించేందుకు రాత్రి 11.59 గంటల వరకు అవకాశం ఉంటుంది. చివరి సమయంలో సర్వర్‌పై ఒత్తిడి పెరగే అవకాశం ఉన్నందున ముందుగానే ఫారం పూర్తి చేయాలని సూచిస్తున్నారు. అభ్యర్థులు అప్లికేషన్ సమయంలో ఫోటో, సంతకం, అవసరమైన పత్రాలను సరిగ్గా అప్‌లోడ్ చేయాలి. తప్పులు జరిగితే సవరణలకు తర్వాత ప్రత్యేకంగా 'కరెక్షన్ విండో' ఇవ్వనున్నారు.

దరఖాస్తు ఫీజు వివరాలు..

  • జనరల్ కేటగిరీ అభ్యర్థులు - రూ.1700
  • ఈడబ్ల్యూఎస్‌, ఓబీసీ-ఎన్‌సీఎల్ - రూ.1600
  • ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, థర్డ్ జెండర్ - రూ.1000
  • విదేశీ అభ్యర్థులు - రూ.9500

ఫీజును ఆన్‌లైన్ విధానంలో డెబిట్ కార్డ్‌, క్రెడిట్ కార్డ్‌, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా చెల్లించవచ్చు.

అర్హతలు..

ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ లేదా బయోటెక్నాలజీ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ (10+2) ఉత్తీర్ణులై ఉండాలి.

ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

అదేవిధంగా అభ్యర్థి కనీసం 17 సంవత్సరాల వయస్సు పూర్తిచేసి ఉండాలి.

పరీక్ష తేదీ..

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన NEET-UG పరీక్షను మే 3, 2026న నిర్వహించనున్నారు. పరీక్ష సమయం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకుగా నిర్ణయించారు. పరీక్ష వ్యవధి 3 గంటలు ఉండనుండగా.. పెన్ అండ్ పేపర్ (ఆఫ్‌లైన్) విధానంలో దేశవ్యాప్తంగా ఉన్న వేలాది పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు.

ప్రశ్నాపత్రం నమూనా..

పరీక్షలో మొత్తం మూడు ప్రధాన సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి.

  • ఫిజిక్స్
  • కెమిస్ట్రీ
  • బయాలజీ (బోటనీ, జూలజీ)

మొత్తం 180 ప్రశ్నలకు 720 మార్కులు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి 4 మార్కులు ఇవ్వగా, తప్పు సమాధానానికి 1 మార్కు నెగెటివ్ మార్కింగ్‌గా తగ్గించబడుతుంది. అభ్యర్థుల సౌకర్యార్థం ఈ పరీక్షను మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. వాటిలో ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, ఒడియా, పంజాబీ, ఉర్దూ తదితర భాషలు ఉన్నాయి.

ఏ ఏ కోర్సుల్లో ప్రవేశాలు..?

నీట్ యూజీ ద్వారా దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పలు వైద్య కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

  • ఎంబీబీఎస్‌ (MBBS)
  • బీడీఎస్‌ (BDS)
  • బీఎఎంఎస్‌ (BAMS)
  • బీఎస్‌ఎంఎస్‌ (BSMS)
  • బీయూఎంఎస్‌ (BUMS)
  • బీహెచ్‌ఎంఎస్‌ (BHMS)

ఇవి కాకుండా కొన్ని నర్సింగ్ మరియు అనుబంధ మెడికల్ కోర్సుల్లో కూడా నీట్ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించే అవకాశం ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+