చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Jobs in Kalikiri Sainik School:టీచర్, క్లర్కు ఉద్యోగాలకు అప్లయ్ చేయండి-అర్హతలు ఇవే..!

|
Google Oneindia TeluguNews

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం అధీనంలో నడిచే సైనిక్ స్కూల్‌లో ఖాళీగా ఉన్న టీచర్, క్లర్కు మరియు జనరల్ ఎంప్లాయి పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా కలికిరి సైనిక్ స్కూల్‌లో టీజీటీ మరియు క్లర్కు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా టీజీటీ సోషల్ సైన్స్‌, మ్యాథ్స్) లోవర్ డివిజన్ క్లర్కు, జనరల్ ఎంప్లాయీ (ఎంటీఎస్ రెగ్యులర్), జనరల్ ఎంప్లాయీ (ఎంటీఎస్) ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 7 ఆగష్టు 2021. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ముందుగా http://sskalrecruitment.mastersofterp.inను సందర్శించి అవసరమైన వివరాలను పూర్తి చేయాలి. తాజాగా తీసుకున్న పాస్‌పోర్టు సైజ్ ఫోటోతో పాటు దానికిందనే మీ సంతకం ఉండేలా ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇక అభ్యర్థి వివరాలను పూర్తి చేయాలి. ఫీజు వివరాల విషయానికొస్తే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు రూ.500గా నిర్ణయించగా... ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.250గా ఫీజు నిర్ణయించడం జరిగింది. ఈ ఫీజును అప్లికేషన్ ఫైనల్ సబ్మిషన్ ముందు ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు నాన్ రీఫండబుల్. అప్లికేషన్ పూర్తయ్యాక దాన్ని ప్రింట్ తీసి పెట్టుకోవాలి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా అప్లికేషన్‌ ప్రింట్‌ను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి.

Sainik School Recruitment 2021:Apply for TGT and Clerk posts in Kalikiri Sainik School

ఇక వచ్చిన దరఖాస్తులను పరిశీలించి షార్ట్ లిస్టు చేసిన అభ్యర్థులను మాత్రమే రాత పరీక్షకు పిలుస్తారు. రాత పరీక్షలో పాసైన అభ్యర్థులకు ప్రాక్టికల్ టెస్టు ఆపై ఇంటర్వ్యూలు నిర్వహించి తుది జాబితాను సిద్ధం చేస్తారు. ఇక ఆన్‌లైన్ దరఖాస్తు చేసేటప్పుడే అన్ని అర్హత సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.ఇక సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఒక ఏడాది పాటు ప్రొబేషన్‌లో ఉంటారు.

ఇక ఏ పోస్టులకు ఎలాంటి అర్హతలు, వేతనం ఎంత..?

టీజీటీ (సోషల్ సైన్స్)-1 గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి హిస్టరీ లేదా జియోగ్రఫీ /ఎకనామిక్స్/ పొలిటికల్ సైన్సు ఒక సబ్జెక్టుగా 50శాతం మార్కులతో ఉత్తీర్ణత. బీఈడీ తప్పనిసరి. సీబీఎస్‌ఈ అనుబంధ స్కూల్స్‌లో రెండేళ్ల టీచింగ్‌లో అనుభవం.

టీజీటీ (మ్యాథ్స్)-1: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి మ్యాథ్స్/ఫిజిక్స్/కెమిస్ట్రీ/ ఎలక్ట్రానిక్స్ లో ఒక సబ్జెక్టుగా 50శాతం మార్కులతో ఉత్తీర్ణత. బీఈడీ తప్పనిసరి. సీబీఎస్‌ఈ అనుబంధ స్కూల్స్‌లో రెండేళ్ల టీచింగ్‌లో అనుభవం.

వేతనం: నెలకు రూ.44,900/-
- 1,42,400/-

లోవర్ డివిజన్ క్లర్కు - 1: మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత, ఇంగ్లీషులో నిమిషానికి 40 పదాలు టైప్‌ చేయాల్సి ఉంటుంది. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి

వేతనం: నెలకు రూ.19,900 - 63,200/-

జనరల్ ఎంప్లాయీ: 10వ తరగతి ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ

వేతనం: నెలకు రూ.18,000 - 56,900

English summary
Sainik school Kalikiri had released a notification to fill up vacancies of TGT, LDC and General employee Vacancy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X