AP EAPCET 2026 Results: ఈసారి ఎంసెట్ ఫలితాలు ఎప్పుడంటే ?

ఏపీలో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ సారి నిర్వహించిన ఎంసెట్ (AP EAPCET 2026) పరీక్షలు ముగిశాయి. ఇంజనీరింగ్ పరీక్షల్ని ఈ నెల 12, 13, 14, 15, 18 తేదీల్లో నిర్వహించారు. అలాగే వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు పరీక్షల్ని ఈ నెల 19, 20 తేదీల్లో నిర్వహించారు. ఈసారి ఈఏపీసెట్ కోసం మొత్తం 3.55 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో ఇంజనీరింగ్ కు 2.75 లక్షలు, వ్యవసాయ, ఫార్మసీ కోర్సులకు 78 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరంతా ఇవాళ్టి వరకూ పరీక్షలు రాశారు.

వీరంతా ఇప్పుడు ఫలితాల కోసం ఎదురుచూడబోతున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నత విద్యామండలి తరఫున కాకినాడ జేఎన్టీయూ ఎంసెట్ ఫలితాల్ని (AP EAPCET 2026 Results) జూన్ 1న విడుదల చేయబోతోంది. ఫలితాలు ప్రకటించిన తర్వాత.. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ , హాల్ టికెట్ వివరాలను ఉపయోగించి అధికారిక ఏపీఎస్‌సీహెచ్ఈ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడం ద్వారా తమ ర్యాంక్ కార్డులు , స్కోర్‌కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

When Are AP EAPCET 2026 Results June 1 Date Confirmed Steps to Download Rank Card and Scorecard

ఎంసెట్ ఫలితాలు విడుదల కాగానే అభ్యర్ధులు ఉన్నత విద్యామండలి వెబ్ సైట్ cets.apsche.ap.gov.in లోకి లాగిన్ అయి ఫలితాలను తెలుసుకోవాల్సి ఉంటింది. ఈసారి అర్హత మార్కుల్ని పరిశీలిస్తే... జనరల్ కేటగిరీకి 160 మార్కులకు గాను 40 (25%) రావాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు కనీస కటాఫ్ వర్తించదు. ఫలితాలు తెలుసుకునేందుకు అధికారిక APSCHE EAPCET వెబ్‌సైట్‌ లోకి వెళ్లి ఫలితాలు/ర్యాంక్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి. రిజిస్ట్రేషన్ నంబర్, పరీక్ష హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేస్తే ఫలితాలు కనిపిస్తాయి. అనంతరం కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియ కోసం స్కోర్‌కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+