నో ఎగ్జామ్.. నిరుద్యోగులకు అదిరిపోయే ఛాన్స్! ఎయిర్‌పోర్టుల్లో ఉద్యోగాలు
విమానాశ్రయాల్లో ఉద్యోగం చేయాలనే కలలు కంటున్న యువతకు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ భారీ శుభవార్త అందించింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్ (AAICLAS) తాజాగా 158 సెక్యూరిటీ స్క్రీనర్ (ఫ్రెషర్) పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ముఖ్యంగా రాత పరీక్ష లేకుండానే ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ఆధారంగా ఎంపిక చేయనుండటం నిరుద్యోగులకు పెద్ద ఊరటనిస్తోంది.
పోస్టులు ఎక్కడెక్కడంటే ???
ఈ నియామకాలు దేశవ్యాప్తంగా పలు ప్రధాన విమానాశ్రయాల్లో చేపట్టనున్నారు. ఎంపికైన అభ్యర్థులు డెహ్రాడూన్, కోల్‌కతా, పాట్నా, త్రిచి, కాలికట్, ఉదయ్‌పూర్ వంటి ప్రముఖ ఎయిర్‌పోర్టుల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా చూస్తే:
పాట్నా - 37 పోస్టులు
ఉదయ్‌పూర్ - 34 పోస్టులు
త్రిచి - 28 పోస్టులు
కోల్‌కతా - 25 పోస్టులు
డెహ్రాడూన్ - 17 పోస్టులు
కాలికట్ - 17 పోస్టులు

విద్యార్హతలు ఇవే..
- సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
- జనరల్ / ఓబీసీ / ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనీసం 60% మార్కులు తప్పనిసరి
- ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులు సరిపోతాయి
- ఇంగ్లీష్ మాట్లాడే నైపుణ్యం, ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.
వయోపరిమితి..
2026 మే 1 నాటికి అభ్యర్థుల గరిష్ట వయస్సు 27 సంవత్సరాలు మించకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపులు వర్తిస్తాయి.
- ఓబీసీ అభ్యర్థులకు - 3 సంవత్సరాలు
- ఎస్సీ / ఎస్టీ అభ్యర్థులకు - 5 సంవత్సరాలు
- దివ్యాంగులకు - 10 సంవత్సరాలు
రాత పరీక్ష లేదు.. ఎలా ఎంపిక చేస్తారు?
ఈ నియామకాల్లో ముఖ్య ఆకర్షణ రాత పరీక్ష లేకపోవడమే. ముందుగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత:
- వ్యక్తిగత ఇంటర్వ్యూ
- డాక్యుమెంట్ వెరిఫికేషన్
- మెడికల్ ఫిట్‌నెస్ టెస్ట్
ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. విమానాశ్రయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా అభ్యర్థులు శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలి.
జీతం ఎంతంటే?
ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన వేతనం అందించనున్నారు. మూడేళ్ల కాంట్రాక్ట్ కాలానికి ప్రతి ఏడాది జీతం పెరుగుతూ ఉంటుంది.
- తొలి ఏడాది - ₹30,000
- రెండో ఏడాది - ₹32,000
- మూడో ఏడాది - ₹34,000
ఇవి కాకుండా షిఫ్ట్ అలవెన్స్, ట్రావెల్ సదుపాయాలు, అనుభవ ధృవపత్రం వంటి ప్రయోజనాలు కూడా లభించే అవకాశం ఉంది.
దరఖాస్తు ఫీజు వివరాలు..
జనరల్ / ఓబీసీ అభ్యర్థులకు - ₹750
ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / మహిళా అభ్యర్థులకు - ₹100
ఫీజును ఆన్‌లైన్ ద్వారానే చెల్లించాలి.
దరఖాస్తు చివరి తేదీ..
ఆసక్తి గల అభ్యర్థులు 2026 జూన్ 8 లోపు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే అప్లై చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో విమానయాన రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా ఫ్రెషర్స్‌కు పెద్దగా అనుభవం అవసరం లేకుండా, రాత పరీక్ష లేకుండా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉద్యోగం దక్కడం అరుదైన అవకాశం అని ఉద్యోగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.












Click it and Unblock the Notifications