అందంపై నీది పొరపాటు మాత్రమే...
చర్చిలో కన్ ఫెషన్ బాక్స్ లోకి వెళ్లిన ఓ యువతి ఫాదర్ తో ఇలా చెప్పింది.
"బ్లెస్ మీ ఫాదర్... ఇవాళ నేనో పాపం చేసాను"
"ఏమటది?" అడిగాడాయన
"అద్దంలో మాటిమాటికి చూసుకుని నేను ఎంతో అందంగా ఉన్నాను అని వందలసార్లు అనుకున్నాను" అందామె
"అది తప్పు కాదు తల్లీ....పొరపాటు" చెప్పాడు నవ్వుతూ ఫాదర్..
------------
హైదరాబాద్ వచ్చే ఇద్దరు టూరిస్టులు గోదావరి ట్రైన్ లో తారసపడ్డారు
"మీరిదివరకు హైదరాబాద్ వెళ్లారా?" ప్రశ్నించాడు ఒఖడు
"చాలా సార్లు.." చెప్పాడు రెండోవాడు
"ఏ హోటల్ బాగుంటుందో దయచేసి చెప్పలగరా?" మళ్లీ అడిగాడు మొదటి వాడు
ఓ హోటల్ పేరు చెప్పాడతను
"ఏం? ఇదివరకు మీరు అందులో దిగారా...?"
"లేదు .. కానీ మిగిలిన అన్ని హోటల్స్ లో దిగాను" చెప్పాడు మొదటి వాడు...












Click it and Unblock the Notifications