ఒకేసారి ఇద్దరు ఎక్కకూడదు..
"ఏంది రాధమ్మా! అంత కోపంగా ఉన్నారు?" అడిగింది పక్కింటి సావిత్రి
"ఏం లేదు.. మన్నూ మషానం, వాడికి ఆ మాత్రం తెలియదా!" అని విసుక్కుంది రాధమ్మ.
"ఏమైందేమిటి?"
"ఈ రోజు రైల్వే స్టేషన్‌కు వెళ్లానా.. అక్కడ వెయింగ్ మిషన్ మీద నిల్చొని కాయిన్ వేశా. బరువెంతో రాకుండా ఇద్దరు ఒకేసారి ఎక్కకూడదని అని రాసి ఉన్న కాగితం వచ్చింది.." చెప్పింది రాధమ్మ.
..... .... ....
"ఓ వాయిలెన్ కొనివ్వు, డాడీ" అడిగాడు గారాలు పోతూ కొడుకు.
"ఇంట్లో వాయిస్తే డిస్టర్బ్ అవుతుంది.. వద్దులే" అన్నాడు డాడీ
"నేనేం డిస్టర్బ్ చేయను.. మీరంతా నిద్రపోయిన తర్వాత వాయిస్తా.." అమాయకంగా కొడుకు.












Click it and Unblock the Notifications